Gongadi Trisha | అండర్-19 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో అత్యద్భుతంగా రాణించిన భద్రాచలానికి చెందిన క్రికెటర్ త్రిష గొంగడిని సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. సీఎం రేవంత్‌ను త్రిష బుధవారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా త్రిషను సీఎం శాలువాతో సత్కరించారు. ఈ క్రమంలో రూ.కోటి నజరానాను ప్రకటించారు. భవిష్యత్‌లో భారత్ తరఫున మరిన్ని టోర్నీల్లో పాల్గొని ఆడాలని సీఎం ఆకాంక్షించారు. అలాగే, టీ20 ప్రపంచకప్ సభ్యురాలైన ధృతి కేసరితో పాటు టీమ్ హెడ్‌కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి రూ.10లక్షల చొప్పున నజరానాను సీఎం రేవంత్ ప్రకటించారు.
ఇటీవల సింగపూర్‌లోని కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఐసీసీ అండర్-19 వుమెన్స్ టీ20 ప్రపంచకప్‌లో యువత భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ నెల 2న దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫైనల్లో త్రిష 44 పరుగులు చేయడంతో పాటు స్పిన్ బౌలింగ్‌తో నాలుగు ఓవర్లు వేసి కేవలం 15 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు తీసింది. అంతకు ముందు స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్‌లో త్రిష ఐసీసీ అండర్-19 టీ20 ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా సెంచరీ నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఐసీసీ టోర్నీలో త్రిష బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ సైతం అద్భుతంగా చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది. టోర్నీలో మొత్తం 309 పరుగులు చేయగా.. ఏడు వికెట్ల పడగొట్టింది.
Rahul Dravid | నడిరోడ్డుపై ఆటో డ్రైవర్‌తో రాహుల్ ద్రవిడ్ వాగ్వాదం.. వీడియో వైరల్
Varun Chakaravarthy | వరుణ్ 2.0.. రీఎంట్రీలో అదరగొడుతున్న మిస్టరీ స్పిన్నర్