e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, May 12, 2021
Home News మేయ‌ర్లు, చైర్మ‌న్ల ఎన్నిక‌కు టీఆర్ఎస్ ప‌రిశీల‌కుల నియామ‌కం

మేయ‌ర్లు, చైర్మ‌న్ల ఎన్నిక‌కు టీఆర్ఎస్ ప‌రిశీల‌కుల నియామ‌కం

మేయ‌ర్లు, చైర్మ‌న్ల ఎన్నిక‌కు టీఆర్ఎస్ ప‌రిశీల‌కుల నియామ‌కం

హైద‌రాబాద్ : గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల‌కు మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, సిద్దిపేట‌, అచ్చంపేట‌, జ‌డ్చ‌ర్ల‌, కొత్తూరు, న‌కిరేక‌ల్ మున్సిపాలిటీల‌కు చైర్మ‌న్లు, వైస్ చైర్మ‌న్ల ఎన్నిక ప్ర‌క్రియ‌కు టీఆర్ఎస్ పార్టీ ప‌రిశీల‌కుల‌ను నియ‌మించింది. ఈ మేర‌కు ఎన్నిక‌ల ప‌రిశీల‌కుల పేర్ల‌ను సీఎం కేసీఆర్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ ఎన్నిక ప్ర‌క్రియ శుక్ర‌వారం జ‌ర‌గ‌నుంది.

వరంగల్ కార్పొరేష‌న్ ఎన్నికల పరిశీలకులు – మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్
ఖమ్మం కార్పొరేష‌న్ పరిశీలకులు – మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి

కొత్తూరు మున్సిపాలిటీకి పరిశీలకులు – మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
నకిరేకల్ మున్సిపాలిటీ పరిశీలకులు – టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు
సిద్దిపేట మున్సిపాలిటీ పరిశీలకులు – రవీందర్ సింగ్ (మాజీ మేయర్ కరీంనగర్), వంటేరు ప్రతాప్ రెడ్డి (ఫారెస్టు డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
అచ్చంపేట మున్సిపాలిటీ పరిశీలకులు – మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
జడ్చర్ల మున్సిపాలిటీ ప‌రిశీల‌కులు – మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి (సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్)

ఎన్నిక‌ల‌ పరిశీలకులు గురువారం సాయంత్రం ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు. పార్టీ అధిష్టానం అందచేసిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్నికల అబ్జ‌ర్వ‌ర్లు ఎన్నిక ప్రక్రియను శుక్రవారం ఉదయం నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కౌన్సిలర్లు ,కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఆయా కార్పొరేషన్లకు మేయర్ల‌ను, డిప్యూటీ మేయర్ల‌ను, ఆయా మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాల‌ని సూచించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

ఉప్ప‌ల్‌లో మంట‌లు చెల‌రేగి ఇద్ద‌రు డ్రైవ‌ర్లు స‌జీవ‌ద‌హ‌నం

శ్రీకాకుళంలో విషాదం.. తండ్రికి క‌రోనా.. నీళ్లు ఇచ్చేందుకు వెళ్లిన బిడ్డ‌ను ఆపిన త‌ల్లి

దేశంలో క‌రోనా ప‌రిస్థితిపై ఆర్బీఐ కీల‌క వ్యాఖ్య‌లు..!

మరాఠా రిజర్వేషన్లు రద్దు చేసిన సుప్రీం కోర్టు

హ్యాట్రిక్‌.. బెంగాల్ ముఖ్య‌మంత్రిగా మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌మాణ స్వీకారం

కరోనా విలయం.. 24 గంటల్లో 3.82లక్షల కేసులు.. 3,780 మంది మృతి

ఒకే కాన్పులో 9 మందికి జ‌న్మ‌నిచ్చిన 25 ఏండ్ల మ‌హిళ‌

Advertisement
మేయ‌ర్లు, చైర్మ‌న్ల ఎన్నిక‌కు టీఆర్ఎస్ ప‌రిశీల‌కుల నియామ‌కం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement