ఈటల రాజేందర్ ఏం చేయలేదు. డబుల్ బెడ్రూం కూడా సాంక్షన్ చేయలేదు. మా రంగపూర్ను ఏం పట్టించుకోలేదు. ఇప్పటి వరకు ఆయన చేసిన పనులు ఏం లేవు. కనీసం ఇంత వరకు మమల్ని పట్టించుకోలేదు. మాకు సీఎం కేసీఆరే ముఖ్యం. మాకు దళిత బంధు రావాలి. కేసీఆర్ మాకు దేవుడు అని మొక్కుతాం. ఆయన దళిత బంధు ఇస్తాడని నమ్మకం ఉంది. ఆ పైసలను మంచిగా ఉపయోగించుకుంటాం. మేం కూలలీ చేసుకుంటేనే బతికేటోళ్లం. 20 ఏండ్ల నుంచి కానీ భూమి పట్టా ఇప్పుడు అయింది. మేం ఎప్పుడూ టీఆర్ఎస్ ను మరిచిపోం. – బొడ్డు కోమలమ్మ ( రంగాపూర్ గ్రామం, హుజూరాబాద్ మండలం )
దళిత బంధు మా దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఇటువంటి పథకం ఏ ప్రభుత్వం అమలు చేయలేదు. కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఎప్పటికీ ఆయనకే మేం ఓటేస్తాం. ప్రతీ కుటుంబానికి దళిత బంధు ఇవ్వాలని కోరుతున్నాం. – శ్రీకాంత్ ( రంగాపూర్ గ్రామం, హుజూరాబాద్ మండలం )