శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Aug 02, 2020 , 12:49:03

పోలీస్ కంటే మంచి స్నేహితుడు ఉండ‌గ‌ల‌రా? : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

పోలీస్ కంటే మంచి స్నేహితుడు ఉండ‌గ‌ల‌రా? : డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి

హైద‌రాబాద్ : పోలీస్ కంటే మంచి స్నేహితుడు ఉండ‌గ‌ల‌రా? అని రాష్ర్ట డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి అన్నారు. నేడు స్నేహితుల దినోత్స‌వం. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని డీజీపీ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విధంగా స్పందించారు. మ‌న ప్ర‌తి అవ‌స‌రంలో స్పందించేవాడు. మ‌న భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ గురించి ఎల్ల‌ప్పుడూ ఆలోచించేవాడు. మ‌న‌కోసం త‌న జీవితాన్ని ప‌ణంగా పెట్టేవాడు. చ‌ట్టానికి, స‌మాజానికి క‌ట్టుబ‌డి ఉండేవారికి పోలీస్ కంటే మంచి స్నేహితుడు ఉండ‌గ‌ల‌డా? అని డీజీపీ పేర్కొన్నారు.


logo