Leopard | రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి కలకలం సృష్టిస్తోంది. ఓ బర్రెపై చిరుత దాడి చేసి చంపింది. చిరుత సంచారంతో స్థానిక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. గంభీరావుపేట మండల పరిధిలోని ముస్తాఫానగర్ గ్రామ శివారులో రాసమల్ల రాజు అనే రైతుకు వ్యవసాయ పొలం ఉంది. అయితే పొలంలోనే పశువుల కోసం ఓ షెడ్‌ను నిర్మించాడు. అందులో బర్రెను కట్టేసి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చాడు. ఇక సోమవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి చూడగా, బర్రె రక్తపు మడుగులో పడి ఉంది.
ఆందోళనకు గురైన రాజు.. గ్రామస్తులను అప్రమత్తం చేశాడు. ఇక అతని పొలంలో పులి పాదముద్రలను గుర్తించారు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి పాదముద్రలను అధికారులు నిర్ధారించారు. అనంతరం రైతులను, స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. చిరుత కదలికలపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Nagarkurnool | రైతులపై కాంగ్రెస్ ఉక్కుపాదం.. బల్మూరు మండలంలో అన్నదాతల అరెస్ట్
BRS | నల్లగొండలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా.. అనుమతి నిరాకరించిన పోలీసులు
KTR | కటింగ్‌లు, కటాఫ్‌లు మినహా.. ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సమాజానికి ఒరిగిందేమిటి..? : కేటీఆర్