BRSV Leaders | బీఆర్ఎస్ నాయకుల రక్తాన్ని కోసి పంటల మీద చల్లితే అదే పండుతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్వీ నాయకులు వినూత్నంగా నిరసన బాట పట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్త దాహం తీర్చేందుకు బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ భవన్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా రక్త దానం చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి,సంజయ్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ భవన్లో రక్త దాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బ్లడ్ ప్యాకెట్లతో రేవంత్ రెడ్డి నివాసానికి బయలుదేరారు.
విద్యార్థులు, నాయకుల నుండి సేకరించిన బ్లడ్ ప్యాకెట్లతో బీఆర్ఎస్వీ నాయకులు రేవంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయం బయలుదేరి వెళ్లే క్రమంలో పోలీసులు తెలంగాణ భవన్ చుట్టూ భారీగా మోహరించారు. బ్లడ్ డొనేట్ చేసిన ప్యాకెట్లతో రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తున్న బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బ్లడ్ డొనేట్ చేసిన ప్యాకెట్లతో రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్వీ
రైతులను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది అన్న రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా బ్లడ్ ప్యాకెట్లతో రేవంత్ రెడ్డి నివాసానికి బీఆర్ఎస్వీ నాయకులు
తెలంగాణ భవన్ చుట్టూ భారీగా మోహరించిన పోలీసులు
బీఆర్ఎస్వీ నాయకులను… https://t.co/8HVJzvnaNr pic.twitter.com/BOAquOazjF
— Telugu Scribe (@TeluguScribe) July 13, 2026