న్యూఢిల్లీ: 18 ఏళ్ల బంధానికి బ్రేక్ పడింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్(Stephen Fleming).. ఆ జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సీఎస్కే, ఫ్లెమింగ్ విడిపోయినట్లు తెలిసింది. అయితే కొత్త వ్యక్తితో కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించే ఆలోచనలో సీఎస్కే ఉన్నట్లు ఓ కథనం ద్వారా తెలిసింది. చెన్నై జట్టు హెడ్‌కోచ్ పదవి కోసం మాజీ టీమిండియా క్రికెటర్ హేమంగ్ బదానీ రేసులో ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం చెన్నై ఫ్రాంచైజీ పెద్దలు అంతా డల్లాస్‌లో ఉన్నారు. అమెరికాలో జరుగుతున్న క్రికెట్ లీగ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరపున ప్రమోషన్ చేస్తున్నారు.
అయితే అమెరికా టోర్నీలో టెక్సారస్ జట్టు పేలవ ప్రదర్శన ఇచ్చింది. 10 మ్యాచుల్లో కేవలం 3 మ్యాచ్‌లే ఆ జట్టు నెగ్గింది. ఆ డల్లాస్ జట్టుకు కూడా స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచ్‌గా ఉన్నారు. కొత్త కోచింగ్ సిబ్బందికి చెందిన చర్చలు జరుగుతున్నాయని, తర్వలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని సీఎస్కేసీఎల్ డైరెక్టర్ రూపా గురునాథ్ తెలిపారు. తమ కోచింగ్ బృందంలో స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలకంగా వ్యవహరించారని, రెండు దశాబ్ధాల పాటు జట్టుకు గుర్తింపు తెచ్చారని, ఓ విజన్ తో వ్యవహరించారని, జట్టును మెరుగ్గా తీర్చిదిద్దారని రూపా తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా ఉన్న హేమాంగ్ బదానీతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సీఎస్కే ప్రతినిధులు తెలిపారు. చెన్నై కోచింగ్ బృందంలో బదానీ చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
2008లో ప్లేయర్‌గా ఫ్లెమింగ్ జట్టులో చేరాడు. ఆ తర్వాత 2009 నుంచి కోచింగ్ బృందంలో చేశాడు. 2016, 2017 సంవత్సరాల్లో చెన్నై జట్టుపై సస్పెన్షన్ విధఙంచారు. ఆ సమయంలో అతను పూణె జట్టుకు కోచ్‌గా చేశారు. 2017లో పూణె జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. కోచ్‌గా ఫ్లెమింగ్ ఉన్న సమయంలో చెన్నై జట్టు 11 సార్లు ఫైనల్స్‌లోకి ప్రవేశించింది,. 10 సార్లు ఐపీఎల్లో, ఓ సారి చాంపియన్స్ లీగ్‌లో ఫైనల్స్‌కు వెళ్లింది. ఆరు సార్లు జట్టు టైటిల్ గెలిచింది.