TS Assembly | తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు సమావేశంలో పలు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టారు. సాగునీటి ప్రాజెక్టులు, సమస్యలే ఎజెండాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షం, అస్త్ర, శస్త్రాలతో సర్వసన్నద్ధమైంది. సమావేశాల్లో భాగంగా శాసనసభలో బీఆర్ఎస్ ఎల్పీ చర్చకు ప్రతిపాదిస్తున్న అంశాలు ఇలా ఉన్నాయి.
* రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు-యూరియా కొరత ,రుణ మాఫీ పంట బోనస్ పెండింగ్ బకాయిలు ,రైతు భరోసా ,రైతు ఆత్మహత్యలు
* వందరోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు రెండేళ్ల పాలన పూర్తయినా అమలు కాని తీరు-అన్ని వర్గాలకు జరిగిన మోసాలు
* ఫార్మా సిటీ రద్దు ,ఫ్యూచర్ సిటీ పేరుతో భూముల ధారాదత్తం
* కొత్త ధర్మల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం తెచ్చిన పాలసీ లో జరిగిన అవినీతి
* బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల పై ప్రభుత్వ తప్పిదాలు
* నిరుద్యోగులకు జాబ్ కేలండర్ ప్రకారం ఇవ్వాల్సిన ఉద్యోగ నోటిఫికెషన్లలో జాప్యం
* ఉద్యోగులకు ,రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం లో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి -ఐదు డీఏ లు ,పీ ఆర్ సీ చెల్లింపులో జాప్యం ,రిటైర్డ్ ఉద్యోగుల కివ్వాల్సిన పెండింగ్ బకాయిల విడుదలలో నిర్లక్ష్యం
* పాలమూరు రంగారెడ్డి ఎత్తి పోతల పథకం డీపీఆర్ కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపడం -45 టీఎంసీ లు చాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించిన తీరు
* హిల్ట్ పాలసీ తో ఐదు లక్షల కోట్ల కుంభకోణం -ప్రభుత్వ భూములను కారు చౌకగా కట్టబెడుతున్న తీరు
* గురుకులాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం -126 కి పైగా విద్యార్థుల మరణాలు
* గ్రేటర్ హైదరాబాద్ లో 22 మున్సిపాలిటీల విలీనం -అ శాస్త్రీయంగా జరిగిన విలీన ప్రక్రియ
*హైడ్రా విపరీత పోకడలు -పేదల ఇళ్ల పై ప్రతాపం -బుల్డోజర్ పాలన
* ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుతో రైతులకు జరుగుతున్నఇబ్బందులు-రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్న ప్రభుత్వ విధానం
* రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలు-శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యం
* ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపును పెండింగ్లో పెట్టడంతో విద్యార్థులు పడుతున్నకష్టాలు