KTR | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఫార్ములా – ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. కానీ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చకు పెట్టే దమ్ము లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఫార్ములా ఈ రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయించుకుంటారు. రేవంత్ రెడ్డి లీకులిచ్చి రాజకీయ దుష్ర్పచారానికి పాల్పడుతున్నారు. ఫార్ములా ఈ రేస్, ఇతర స్కాములంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్నా సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయి కదా..? చర్చ నాలుగు గోడల మధ్య కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. లీకు వీరుడు సీఎం ఇచ్చే లీకులే తప్ప నిజాలు అధికారికంగా చెప్పే దమ్ములేదు అని కేటీఆర్ అన్నారు.
ఈ ఫార్ములా రేస్‌లో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టులకు వెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. న్యాయంగా వ్యవహరించే, ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వేంటనే కేసు కొట్టేస్తారనే నమక్మముంది. అధికారికంగా చెప్పే దమ్ములేక కేబినెట్లో నాలుగు గంటల చర్చ అంటూ వార్తలు రాపిస్తున్నారు. కేబినెట్ అంటే గాసిప్ బ్యాచ్ లెక్క తయారైంది. నిజాలు చెప్పే దమ్ము లేఖ సీఎస్‌తో నోటీసులు, అనుమతులు అంటూ లీకులిస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇది నిర్మాణాత్మక ప్రభుత్వం కానే కాదు.. విధ్వంసకారుడి వికృత ఆలోచనలకు ప్రతిరూపం..! : కేటీఆర్
BRS | భూభారతి చట్టం ప్రకటనలపై.. బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు