KTR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిల్లర భాషపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం ఏదో ఒక చిల్లర భాష మాట్లాడి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చూస్తారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డికి ఒక టాక్టిక్ అలవాటైంది. అది అటెన్షన్, డైవర్షన్ టాక్టిక్. ఏదో చిల్లర భాష, బజారు భాష మాట్లాడాలి. దాని వైపు దృష్టి మరల్చాలి. దరిద్రం ఏంది అంటే ఆయనే మాట్లాడే బూతు మాటలు, కేసీఆర్‌ను తిట్టినవి చూపించి పైశాచిక ఆనందం పొందే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి.. అదో రోగం ఉంది కొన్ని మీడియా సంస్థలకు. ఎందుకంటే వాళ్లకి తెలంగాణ ఇష్టం లేదు.. తెలంగాణ అస్థిత్వం ఇష్టం లేదు అని కేటీఆర్ తెలిపారు.
ఇక కేసీఆర్‌ను తిడితే సంకలు గుద్దుకుంటూ, బాగా తిట్టిండు అని సంబురపడే కొందరు సన్నాసులకు చెబుతున్నాను.. మేం అటెన్షన్ డైవర్ట్ కాము. మేం బరాబర్ రైతులతోనే ఉంటాం. కానీ ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఎంత చిల్లరగా మాట్లాడిన, ఎంత బజారు భాష మాట్లాడిన, తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా.. మేం రైతుల కోసమే రణం చేస్తాం. రైతులతోనే ఉంటాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ముఖ్యమంత్రి గారు ఏదోక చిల్లర భాష మాట్లాడి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చూస్తారు
దరిద్రం ఏంది అంటే ఆయనే మాట్లాడే బూతు మాటలు, కేసీఆర్‌ను తిట్టినవి చూపించి పైశాచిక ఆనందం పొందే కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి.. ఎందుకంటే వాళ్లకి తెలంగాణ ఇష్టం లేదు
కానీ ఇష్యూస్ డైవర్ట్ చేయడానికి రేవంత్… pic.twitter.com/gfKwLcR8VW
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2024
ఇవి కూడా చదవండి..
KTR | నాకంటూ ఎలాంటి ఫామ్ హౌజ్ లేదు.. తప్పుంటే దగ్గరుండి నేనే కూలగొట్టిస్తా : కేటీఆర్
SDM mistakenly lathi-charged | డిప్యూటీ కలెక్టర్‌పై పొరపాటున లాఠీచార్జ్.. వీడియో వైరల్