Harish Rao | సీఎం రేవంత్ పాపం ప్రజలకు శాపం కాకూడదు.. రేపు యాదాద్రికి వెళ్లి ప్రార్థిస్తామన్న హరీశ్‌రావు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని ప్రార్థిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం రేపు యాదాద్రి దేవాలయం దర్శించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి పూజలు చేయబోతున్నామని ఆయన చెప్పారు.
Harish Rao | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహాస్వామిని ప్రార్థిస్తామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం రేపు యాదాద్రి దేవాలయం దర్శించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి పూజలు చేయబోతున్నామని ఆయన చెప్పారు. ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని యాదగిరి నరసింహాస్వామిని వేడుకుంటామమని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారు. రూ. 49 వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని డిసెంబర్ నెలలో చెప్పారు. కడుపు కట్టుకుంటే చాలు ఒక్క ఏడాదిలో రూ. 40 వేల కోట్ల రుణమాఫీ చేస్తానని జనవరిలో అన్నారు. కేబినెట్లో నిర్ణయించిన రూ. 31 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టారు. మొన్నటి బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 26 వేల కోట్లకు కుదించారు అని హరీశ్‌రావు గుర్తు చేశారు.
ఆగస్టు15 నాడు రుణమాఫీ పూర్తయిందని చెప్పి రూ. 17 వేల కోట్లన్నారు. రుణమాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతుంటే మరోవైపు మంత్రులు కాలేదు అంటున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రుణమాఫీ పూర్తిగా జరగలేదని, మిగిలిన రూ. 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామని ప్రకటించారు. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 17 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని అంటున్నారు. ఇందులో ఎవరి మాట నిజమో తెలియక, రుణమాఫీ కాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకులు, కలెక్టరేట్ల చూట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. కోతల ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు, దేవుళ్ల మీద ఒట్లు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డిని నిలదీసేందుకు రేపు ఆలేరులో నిర్వహించే ధర్నాలో పాల్గొంటాను. రైతలందరి తరుపునా ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుతామని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy | ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం భూ సేకరణ ప్రారంభించండి : సీఎం రేవంత్ రెడ్డి
KTR | నాకంటూ ఎలాంటి ఫామ్ హౌజ్ లేదు.. తప్పుంటే దగ్గరుండి నేనే కూలగొట్టిస్తా : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

