KTR | హైదరాబాద్ : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుసగా రెండు రోజులు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇండ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈడీ దాడులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
సూపర్ ధనిక మంత్రిపై దాడుల తర్వాత ఈడీ మౌనం ఎందుకు వహించింది..? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఐదు రోజులైనా ఈడీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య బంధంలో ఇది ఒక నాటకమా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈడీ వరుసగా రెండు రోజులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇండ్లు, కార్యాలయాలపై దాడులు చేస్తే కనీసం ఢిల్లీ పెద్దలెవరూ కూడా ఖండించలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, సహచర మంత్రులు సైతం ముఖం చాటేసినట్టు స్పష్టంగా అర్థమవుతున్నది. ఈ అంశం ఇప్పుడు అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో చర్చనీయాంశంగా మారింది. ఇతర రాష్ర్టాల్లోని కాంగ్రెస్ నేతలు, ఆప్ వంటి కూటమి నేతలపై ఈడీ, సీబీఐ దాడులు జరిగితే కాంగ్రెస్ అగ్రనేతలు దర్యాప్తు సంస్థలు, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడతారు. కానీ, పొంగులేటి విషయం లో సైలెంట్పై చర్చ జరుగుతున్నది.
ఇవి కూడా చదవండి..
MLA Sabitha | సురేఖమ్మ.. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది : సబితా ఇంద్రారెడ్డి
YSR | సమంత చెప్పిందా..? నాగచైతన్య చెప్పిండా నీకు..? కొండా సురేఖపై వైఎస్సార్ ఫైర్
KTR | కొండా సురేఖ దొంగ ఏడుపులు.. పెడబొబ్బలు దేనికి..? ప్రశ్నించిన కేటీఆర్