KTR | హైదరాబాద్ : రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కాంట్రాక్టర్ మంత్రి.. ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
కొత్తగా మంత్రి పదవి వచ్చింది.. ఆగబట్టులేకపోతున్నారు.. అన్నీ బయటకు వస్తాయి. ఎవరెవరి దగ్గర రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు గుంజుకుంటున్నారు.. ఎవరెవరి దగ్గర 30 నుంచి 40 శాతం భూములు రాయించుకుంటున్నాడు.. ప్రతి దానికి టైం వస్తది. వన్ ఇయర్ నుంచి టైం పాస్ చేస్తున్నారు. ఈ సన్నాసులతో మీకు కాలక్షేపం నడుస్తోంది.. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, జన్వాడ, డ్రగ్స్, హైడ్రా.. ఈ డ్రామాలు తప్ప రైతుభరోసా, 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఎక్కడ పోయాయి. ఇది ఆరంభం మాత్రమే మా మీద కేసులకు.. ఇంకా నాలుగేండ్లలో చాలా ఉంటాయి మాకు కూడా తెలుసు.. అన్నీ ఎదుర్కొంటాం.. రక్షణ కవచంలాగా న్యాయవస్థ ఉంది. ఇలాంటి దుర్మార్గుల పన్నాగాలను అడ్డుకోవడానికి అంబేద్కర్ న్యాయ వ్యవస్థ అందించారు. తప్పకుండా న్యాయవ్యవస్థ మీద గౌరవం, సంపూర్ణమైన విశ్వాసం ఉంది అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | చిట్టి నాయుడిది శునకానందం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Sankranthi Holidays | 11 నుంచి 16 వరకు ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు