KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ కబంధహస్తాల నుండి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలని మరో సంకల్ప దీక్ష చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాటలను కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
సమైక్య రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ పాలనలో ప్రతి వర్గం, ప్రతి మనిషి బతుకు చిధ్రమైన పరిస్థితి. మళ్లీ ఇవాళ ఆ పరిస్థితితులు తిరిగి కనబడుతున్నాయి. అదే నిర్బంధం, అదే అణిచివేత, అవే దుర్భర పరిస్థితులు, ఆందోళనకరమైన పరిస్థితి కనబడుతుంది. నాడు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో నేడు మళ్లీ రెండు ఢిల్లీ పార్టీ మెడలు వంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్కు అధికారం ఇస్తే తిరిగి తెలంగాణలో బతుకు అంధకారమైందని రైతులు, ఆటో కార్మికులు, నిర్మాణ రంగంలో ఉండే కూలీలు అట్టడుగు స్థాయి నుంచి సంపన్న వర్గాల వరకు అందరూ బాధపడుతున్నారు అని కేటీఆర్ తెలిపారు.
ఈ దీక్షా దివస్ నుంచి స్ఫూర్తి పొంది.. తన సంకల్ప బలంతో అందర్నీ మెప్పించి ఒప్పించి ముందుకు పోయాడు కేసీఆర్. అదే విధంగా కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకు మరో సంకల్ప దీక్ష కూడా చేపట్టాల్సిన తరుణం ఆసన్నమైంది. ఆనాడైనా, ఏనాడైనా, ఈనాడైనా తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని జయశంకర్ సార్ చెప్పేవారు. కేసీఆర నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. దాని కోసం పార్టీ శ్రేణులు కలిసికట్టుగా ముందుకు పోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి..
KTR | 60 ఏండ్ల తెలంగాణ ఉద్యమంపై చెరిగిపోని సంతకం కేసీఆర్ : కేటీఆర్
KTR | నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Bhatti Vikramarka | రేవంత్ ఫెయిల్.. భట్టే బెటర్! జార్ఖండ్లో ఫలించిన విక్రమార్క వ్యూహాలు