KTR | నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
KTR | ఫార్మా విలేజ్ కాదు.. పారిశ్రామిక కారిడార్ అంటూ మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
KTR | హైదరాబాద్ : ఫార్మా విలేజ్ కాదు.. పారిశ్రామిక కారిడార్ అంటూ మాట మార్చిన సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
సీఎం రేవంత్ రెడ్డిది నోరు అయితే నిజాలు వస్తాయి.. అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయని కేటీఆర్ విమర్శించారు. పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్లో భూసేకరణ ఫార్మా విలేజ్ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తుంది. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలుమార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేస్తివి అని మండిపడ్డారు కేటీఆర్.
తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొడితివి. మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా..? ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా..? ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నావ్. చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావు అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.
రేవంత్ రెడ్డి .. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది
అది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయి
పిల్ల చేష్టలు, గారడీ మాటలు,లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావ్
నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్ లో భూసేకరణ ఫార్మా విలేజ్ ల కోసం అని… pic.twitter.com/gWGJl8GFjI
— KTR (@KTRBRS) November 24, 2024
ఇవి కూడా చదవండి..
Bhatti Vikramarka | రేవంత్ ఫెయిల్.. భట్టే బెటర్! జార్ఖండ్లో ఫలించిన విక్రమార్క వ్యూహాలు
KTR | దేశంలో ప్రాంతీయ పార్టీల శకమే..మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలే దీనికి నిదర్శనం : కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

