Bhatti Vikramarka | రేవంత్ ఫెయిల్.. భట్టే బెటర్! జార్ఖండ్‌లో ఫలించిన విక్రమార్క వ్యూహాలు
Bhatti Vikramarka | సీఎం రేవంత్‌రెడ్డి కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బెటర్ అని రాజకీయ విశ్లేషకులతోపాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నిరూపణ అయిందని వారు భావిస్తున్నారు.
- పొత్తులు, సీట్ల సర్దుబాటులో కీలక భూమిక
- బెడిసికొట్టిన సీఎం రేవంత్ ప్రచార సభలు
Bhatti Vikramarka | హైదరాబాద్, నవంబర్23( నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి కంటే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బెటర్ అని రాజకీయ విశ్లేషకులతోపాటు కాంగ్రెస్ క్యాడర్ కూడా భావిస్తున్నది. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఇది నిరూపణ అయిందని వారు భావిస్తున్నారు. మహారాష్ట్రలోని మరఠ్వాడ, విదర్భ ప్రాంతాలకు సీఎం రేవంత్‌రెడ్డిని స్టార్ క్యాంపెయినర్‌గా విఫలమవగా, జార్ఖండ్‌లో ఏఐసీసీ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్క సక్సెస్‌ను అందుకున్నారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
వేదికలపైన అట్టహాసం, ఊకదంపుడు ఉపన్యాసాలతో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కూటమిని భ్రష్టు పట్టించారని, భట్టి విక్రమార్క మాత్రం క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహ ప్రతివ్యూహాలను ఎప్పటికప్పుడు అధిష్ఠానంతో సమన్వయం చేసుకుంటూ జేఎంఎం కూటమిని విజయ తీరాలకు చేర్చడంలో కీలక భూమిక పోషించారని అంటున్నారు. మహా వికాస్ అగాడీ తరఫున ఎన్నికల ప్రచార బరిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వ హెలికాప్టర్‌ను వినియోగించుకుంటూ మహారాష్ట్రలో చక్కర్లు కొట్టారు. తెలంగాణ ఓటర్లు పెద్ద సంఖ్యలో స్థిరపడిన జిల్లాల్లోనే ఆయన పర్యటించారు. రోడ్ షోలు, బహిరంగసభలు నిర్వహించారు. మహా వికాస్ అగాఢీ అభ్యర్థులతో కలిసి ముమ్మర ప్రచారం సాగించారు. కానీ మహారాష్ట్రలో ఆ కూటమికి రేవంత్‌రెడ్డి ఓటమిని మూటగట్టించారని అసంతృప్తి రగులుతున్నది.
భట్టి ప్లాన్ సక్సెస్
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌గా కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 44 సీట్లు కావాల్సి ఉన్నది. కాంగ్రెస్, జేఎంఎం కూటమి 55 స్థానాలు గెలుచుకున్నది. ఈ విజయం వెనుక భట్టి విక్రమార్క వ్యూహాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
అట్టహాసాల కంటే క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను అంచనా వేయడానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని, క్షేత్రస్థాయి సమస్యలు, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తులు, పైఎత్తులు ఇతర అంశాలను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతో సమన్వయం చేసుకుంటూ.. కిందిస్థాయిలో అమలు పరిచారని వారు చెప్తున్నారు. అభ్యర్థుల ఎంపిక, జేఎంఎంతో పొత్తులు, సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించి అధిష్ఠానాన్ని ఒప్పించడంలో భట్టి సక్సెస్ అయ్యారని అభిప్రాయపడ్డారు. పోలింగ్ శాతాన్ని పెంచడంపై భట్టి ప్రత్యేక ప్లాన్ కాంగ్రెస్, జేఎంఎం కూటమి గెలుపునకు దోహదపడిందని చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mobile Blast | క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో రోగుల పరుగులు.. Video
‘పట్టభద్రులు ఓటు నమోదులో భాగస్వాములు కావాలి’
ప్రజావాణికి స్పందన కరువు
Ar Rahman | అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదు.. ‘రామాయణ’ విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Rajasthan | రోడ్డు నిర్మాణ పనుల్లో కరెంట్ షాక్.. 8 మంది కార్మికులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

