KTR | హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనానికి మేడిగడ్డ బ్యారేజీనే సాక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి పార్టీ ఫిరాయింపులు, నిరుద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడిన అనంతరం మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితిపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు.
మేడిగడ్డ కొట్టుకు పోయిందని.. కాళేశ్వరంలో లక్ష కోట్లు గంగ పాలైందని చెప్పి చిల్లర మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ సిగ్గుతో తల దించుకోక తప్పదు. మేము మొదటి నుండి ఒక్కటే చెప్పినం.. అక్కడ జరిగింది చిన్న విషయమే పెద్దది కాదని చెప్పాము. ఈ రోజు ప్రాణహిత, గోదావరి నుంచి వరద నీరు వచ్చిన కూడా తట్టుకొని మేడిగడ్డ నిలబడటమే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనానికి సాక్ష్యమని చెప్పక తప్పదు. మేడిగడ్డను త్వరలో సందర్శిస్తాం.. విజువల్స్ తీసుకు వచ్చి ప్రజలకు వివరంగా చెప్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎక్స్ అఫీషియల్ హ్యాండిల్లో ‘కాంగ్రెస్ కుట్రలను తట్టుకొని నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు.. నిండు కుండలా మేడిగడ్డ బ్యారేజీ’ అంటూ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద వీడియోను పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ‘మేడిగడ్డ బ్యారేజీ మొత్తం కుంగిపోయింది. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని కాంగ్రెస్ పార్టీ, వందల కొద్దీ యూట్యూబ్ చానెళ్లు నెలల పాటు దుష్ప్రచారం చేసినా.. వాళ్ల కుళ్లు, కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెకుల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలను చూసి ఓర్వలేని సన్నాసులు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార. కేసీఆర్‌పై, కాళేశ్వరం మీద బురదజల్లే ప్రయత్నం ఎవరు చేసినా చరిత్ర హీనులుగా మిగిలిపోవడం ఖాయం. జై తెలంగాణ’ అంటూ కేటీఆర్ నిన్న పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ నిరుద్యోగులపై రేవంత్ ప్రభుత్వం కక్ష కట్టింది : కేటీఆర్
Telangana | ఉన్నత పాఠశాలల పనివేళలు మార్పు.. కొత్త టైమింగ్స్ ఇవే..!
KTR | ఇలాంటి నిరసనలు చూసి యుగాలైంది.. కరెంట్ కోతలపై కేటీఆర్ ట్వీట్