KTR | హైదరాబాద్ : మాదాపూర్‌లోని సున్నం చెరువులో గుడిసెలు వేసుకున్న వలస కూలీలపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. రూపాయి రూపాయి పోగు చేసుకుని, కూడబెట్టుకున్న ఆ సొమ్ముతో కొనుగోలు చేసిన జాగాలపైకి బుల్డోజర్లను పంపి.. వారి జీవితాలను విధ్వంసం చేసిన విషయం విదితమే. అయితే గుడిసెల్లో నివాసముంటున్న ఓ చిన్నారి మాటలు అందరి హృదయాలను కలిచివేస్తున్నాయి. ఆ చిన్నారి మాటలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
అభంశుభం తెలియని చిన్నారిపైనా.. ఈ సీఎం ప్రతాపం చూపించడం అని కేటీఆర్ ప్రశ్నించారు. బుజ్జిబుజ్జి మాటలు వినైనా.. మీకు బాధనిపించలేదా..? పసిపాప కన్నీళ్లు చూసైనా.. సర్కారుకు కనికరం కలగలేదా..! అని అడిగారు. పేద పిల్లలు బుక్స్ తీసుకునే టైం కూడా ఇవ్వరా..? ఇళ్లపైకే కాదు.. పుస్తకాలపైకి బుల్డోజర్లు పంపుతారా..? అని నిలదీశారు. చిట్టితల్లి చేతులు జోడించి వేడుకున్నా వినిపించుకోరా..! వీళ్ల గూడు చెదరగొట్టిన సర్కార్‌కు పేదలపై ప్రేమలేదు. పసిహృదయాన్ని గాయపరిచిన ముఖ్యమంత్రికి మనసు లేదు అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ చిన్నారిపైనా.. ఈ సీఎం ప్రతాపం..!
బుజ్జిబుజ్జి మాటలు వినైనా.. మీకు బాధనిపించలేదా ? పసిపాప కన్నీళ్లు చూసైనా.. సర్కారుకు కనికరం కలగలేదా
పేద పిల్లలు బుక్స్ తీసుకునే టైం కూడా ఇవ్వరా? ఇళ్లపైకే కాదు.. పుస్తకాలపైకి బుల్డోజర్లు పంపుతారా
చిట్టితల్లి చేతులు జోడించి వేడుకున్నా… https://t.co/yIgeafWyZW
— KTR (@KTRBRS) September 10, 2024
ఇవి కూడా చదవండి..
KTR | మంచి నీళ్లను కూడా వదలట్లేదు.. ఆ పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్ : కేటీఆర్
TG High Court | హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం హైకోర్టు కీలక ఆదేశాలు..!
Kondareddypalli | మోడల్ సోలార్ విలేజ్‌గా కొండారెడ్డిపల్లి.. సీఎం రేవంత్ ఆదేశాలతో ఇంటింటి సర్వే