KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ రాజ్యంలో ప్రతి పేదోడి బతుకు ఆగమాగం అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలను రద్దు చేసిన రేవంత్ సర్కార్.. చివరకు తాగే మంచి నీళ్ల పథకానికి కూడా తూట్లు పొడిచిందని కేటీఆర్ మండిపడ్డారు.
మంచి నీళ్లను కూడా వదలని జూటా కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గాలికి వదిలి-బీఆర్ఎస్ పథకాలపై ప్రతాపం చూపుతున్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి బతుకు ఆగమాగం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రకటించిన గృహ జ్యోతి పథకానికి తూట్లు పొడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ అమలు చేసిన 20 వేల లీటర్ల ఉచిత మంచి నీరు పథకంపై కుట్రలు చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. ఒక వైపు రుణమాఫీ కాలేదు, డబ్బులు కట్టండి అని రైతులకు నోటీసులు, మరో వైపు నిరుపేదల ఇండ్లకు హైడ్రా నోటీసులు, ఇప్పుడు నల్లా బిల్లు అంటూ డోర్లకు బిల్లులు అతికిస్తున్న ఘటనలు తెలంగాణలో చోటు చేసుకుంటున్నాయని కేటీఆర్ తెలిపారు.
మంచి నీళ్లను కూడా వదలని జూటా కాంగ్రెస్
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు గాలికి వదిలి-బిఆర్ఎస్ పథకాలపై ప్రతాపం. ఇందిరమ్మ రాజ్యంలో పేదోడి బతుకు ఆగమాగం
తాము ప్రకటించిన గృహ జ్యోతి తూట్లు పొడిచిన కాంగ్రెస్ ఇప్పుడు బిఆర్ఎస్ అమలు చేసిన 20వేల లీటర్ల ఉచిత మంచి నీరు పథకం పై కుట్రలు చెయ్యడం… pic.twitter.com/0tiKvBX415
— KTR (@KTRBRS) September 10, 2024
ఇవి కూడా చదవండి..
Revanth Reddy | 16న ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Kondareddypalli | మోడల్ సోలార్ విలేజ్‌గా కొండారెడ్డిపల్లి.. సీఎం రేవంత్ ఆదేశాలతో ఇంటింటి సర్వే
TG High Court | హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం హైకోర్టు కీలక ఆదేశాలు..!