Kondareddypalli | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంతూరు కొండారెడ్డిపల్లిని రాష్ట్రంలోనే పూర్తిస్థాయి సోలరైజ్డ్ గ్రామంగా ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో కొండారెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్‌గా చేయుటకు అధికారులు ప్రక్రియ ప్రారంభించారు.
టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ, నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, రెడ్కో వీసీ, ఎండీ అనిల, సంస్థ డైరెక్టర్ కే రాములు, ఇతర శాఖల ముఖ్య అధికారులు.. మంగళవారం కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. గ్రామస్తులు, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో అధికారులు మాట్లాడి, ఈ పైలట్ ప్రాజెక్టు వివరాలు తెలిపారు.
కొండారెడ్డిపల్లిలో దాదాపు 499 గృహ వినియోగదారులు, 66 వాణిజ్య వినియోగదారులు, 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కేటగిరిలతో కలుపుకుని మొత్తం 1451 వినియోగదారులు ఉన్నారు. ఈ మోడల్ ప్రాజెక్ట్ అమలు చేసేందుకు మంగళవారం నుంచి ఇంటింటి సర్వే చేయడం ప్రారంభించారు. ఈ సర్వే ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి డీపీఆర్ తయారు చేసి, ఇతర ప్రక్రియలను ప్రారంభించనున్నారు.
ఇవి కూడా చదవండి..
TG High Court | హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనం హైకోర్టు కీలక ఆదేశాలు..!
Y.Satish Reddy | ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ ఆఫీస్‌కు రండి.. అరికెపూడి గాంధీకి వై.సతీష్ రెడ్డి సవాల్