హైదరాబాద్ : ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ(Arekapudi gandhi )ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ ఆఫీస్కు (BRS office)రావాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి(Y.Satish Reddy) సవాల్ విసిరారు. పీఏసీ చైర్మన్గా(PAC Chairman) ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేను నియమించాలనే నిబంధనను కాంగ్రెస్ ప్రభు త్వం తుంగలో తొక్కి ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎ స్ ఎమ్మెల్యేకు ఆ పదవి ఇచ్చి.. ప్రతిపక్ష పార్టీ సభ్యుడికే ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. అరికె పూడి గాంధీ మాట్లాడుతున్న మాటలు మరీ హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
స్వయంగా వెళ్లి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్(Congress) కండువా కప్పించుకుని.. ఇప్పుడేమో నేను ప్రతిపక్షంలోనే ఉన్నానని చెప్పుకుంటున్నారు. అరికెపూడి గాంధీ ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు.? ఆయన పోటీ చేసిన పార్టీ ఏ పక్షంలో ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలోనే ఉన్నా అని చెప్పడంలోనే నువ్వు ఏ పక్షంలో ఉన్నావో అర్థమవుతోంది. ప్రతిపక్ష హోదాలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. నువ్వు ప్రతిపక్షంలోనే ఉంటే తెలంగాణ భవన్కు రావాలన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉంటే ప్రతిపక్ష పార్టీ ఎందుకు అభ్యంతరం తెలుపుందని సూటిగా ప్రశ్నించారు?
అరికెపూడి గాంధీ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అందుకే పీఏసీ చైర్మన్ ఇచ్చామని రేవంత్ రెడ్డితో చెప్పించాలన్నారు. మరో హస్యాస్పదమైన విషయంలో ఏంటంటే.. పార్లమెంట్లో పీఏసీ చైర్మన్ ప్రతి పక్ష కాంగ్రెస్కు చెందిన సభ్యుడు ఉన్నారు. కానీ ఆయన ఎందుకు నేను ప్రతిపక్షంలోనే ఉన్నానని చెప్పడం లేదు. తెలంగాణలో మాత్రం ఎందుకు చెప్పుకుంటున్నారు.
అంటే కాంగ్రెస్ లో చేరాం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారా.? ఆ మాట బయట చెబితే ప్రజలు కొడ తారని భయపడుతున్నారా.? కనీసం కాంగ్రెస్ లో చేరామని చెప్పుకోలేకపోతున్నారంటే మిమ్మల్ని, మిమ్మల్ని చేర్చుకున్న కాంగ్రెస్ ని ఏమనాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా అరికెపూడి గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.