KTR | పార్టీ కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సామాన్యులను సైతం కలిసి ఆప్యాయంగా పలుకరిస్తారు వారి యోగక్షేమాలు తెలుసుకుంటారు. అభిమానుల ఇష్టం మేరకు వారితో ఫొటోలు కూడా దిగి.. సామాన్యుడిలా గొప్ప మనసు చాటుకుంటారు.
ఇవాళ నల్లగొండ జిల్లాలోని క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన రైతు మహా ధర్నాకు హైదరాబాద్ నుంచి బయల్దేరారు. మార్గమధ్యలో కేటీఆర్‌ను చూసిన ఓ ఇద్దరు ముగ్గురు పిల్లలు సంతోషంతో ఉప్పొంగిపోయారు. కేటీఆర్‌కు హాయ్ చెబుతూ.. మురిసిపోయారు. ఇక వారి ప్రేమానురాగాలకు ముగ్ధుడైన కేటీఆర్.. తన కారును మార్గమధ్యలోనే ఆపేశారు.
ఇక ఆ చిన్నారులతో పాటు వారి కుటుంబ సభ్యులను కేటీఆర్ ఆప్యాయంగా పలుకరించారు. కడపకు చెందిన ఆ కుటుంబంలోని చిన్నారులతో ప్రత్యేకంగా ఫోటో దిగారు రామన్న. అవధులు లేని ఆప్యాయత.. అభిమానం రామన్నకే సొంతం.
అవధులు లేని ఆప్యాయత.. అభిమానం రామన్నకే సొంతం ❤️
చిన్నారులతో ఫోటో దిగేందుకు తన వాహనాన్ని ఆపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
నల్లగొండ రైతు మహాధర్నాకు బయలుదేరిన క్రమంలో, మార్గ మధ్యలో కేటీఆర్ పలువురు అభిమానులను ఆప్యాయంగా కలిసి ఫోటోలు దిగారు. కడపకు చెందిన ఒక కుటుంబంలోని… pic.twitter.com/ER05O5Eloh
— BRS Party (@BRSparty) January 28, 2025
ఇవి కూడా చదవండి..
KVN Reddy | రైతు భరోసా ఎక్కడ అంటూ నిలదీసిన రైతులు.. కొట్టడానికి చెయ్యెత్తిన కాంగ్రెస్ నేత
Telangana | 4 నెలలైనా తొలి జీతం ఇయ్యలె.. నూతన ఏఈఈలకు ఆదిలోనే చేదు అనుభవం!