KTR | హైదరాబాద్ : మౌలాలిలో ప్రొఫెసర్ సాయిబాబా భౌతిక కాయానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కేటీఆర్ ప్రార్థించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బాల్క సుమన్, పల్లె రవి కుమార్, తుల ఉమతో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు.
హక్కుల ఉద్యమకారుడు ప్రొఫెసర్ సాయిబాబా అకాల మరణం బాధాకరం అని కేటీఆర్ పేర్కొన్నారు. వారి కుటుంబసభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. దేశంలోని ప్రజా ఉద్యమాలకు ప్రొఫెసర్ సాయిబాబా మరణం తీరని లోటు అని కేటీఆర్ అన్నారు.
ఇవి కూడా చదవండి..
TGPSC | నేటి నుంచి గ్రూప్-1 హాల్టికెట్లు.. మరికాసేపట్లో విడుదల చేయనున్న టీజీపీఎస్సీ
CPI Narayana | సాయిబాబాది సహజ మరణం కాదు, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే : సీపీఐ నారాయణ
KTR | కాంగ్రెస్ పాలనపై నిరసనలకు సిద్ధమవుతున్న ప్రజలు.. ముఖ్రాకే వాసులకు కేటీఆర్ మద్దతు