హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుచేయాలంటూ పోరుబాటపట్టిన ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కే గ్రామస్థులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మద్దతు తెలిపారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 300 రోజులైనా హామీలు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ మోసపూరిత హామీలు ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు నిరసనలకు సిద్ధమతున్నారని ఎక్స్ వేదికగా చెప్పారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలంటూ ముఖ్రా కే గ్రామానికి చెందిన ప్రజలు వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. హామీలను గుర్తుచేస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, సీనియర్ నేత సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తరాలు పంపించారు.
Villagers of Mukhra village in Adilabad district have written to @RahulGandhi to immediately start the implementation of 6 guarantees in Telangana
6 guarantees were assured to be implemented within 100 days of Govt formation. It’s been over 300 days and no signs of progress!… https://t.co/eviJpwmtJ8
— KTR (@KTRBRS) October 14, 2024