KTR | హైదరాబాద్ : ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు అంశాలను కేసీఆర్‌కు కేటీఆర్ వివరించారు. నిన్న జరిగిన ఏసీబీ విచారణతో పాటు పలు అంశాలను పార్టీ అధినేతతో కేటీఆర్ చర్చించారు.
ఫార్ములా ఈ-కార్ రేస్‌కు సంబంధించి గురువారం ఉదయం ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరైన సంగతి తెలిసిందే. నలుగురు విచారణాధికారుల బృందం సుమారు 7 గంటల పాటు.. 82 ప్రశ్నలు అడిగింది. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు కేటీఆర్ ఓపిగ్గా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. ఫైల్ మూమెంట్ పైన ఏసీబీ సంధించిన ప్రశ్నలకు ‘ఫైల్ మూమెంట్‌కు చట్టపరంగా బాధ్యత వహించే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎందుకు నోటీసు ఇవ్వలేదు?’ అని కేటీఆర్ ప్రశ్నించినట్టు సమాచా రం. ముఖ్యంగా క్యాబినెట్ ఆమోదం లేకుం డా డబ్బులు ఎలా బదిలీ చేశారనే అంశం గురించి ఏసీబీ ప్రశ్నించినప్పుడు.. ‘క్యాబినెట్ ఆమోదం లేకుండా రేసును రద్దు చేసిన సీఎం ను బాధ్యుడిగా చేయాల్సి వస్తుంది. ఆ పని ఎందుకు చేయలేదు’ అని కేటీఆర్ అడిగినట్టు తెలిసింది. రేసు రద్దు వల్ల జరిగిన నష్టానికి ముఖ్యమంత్రి పైన కూడా కేసు నమోదు చే యాలని కేటీఆర్ కోరినట్టు సమాచారం. కొ న్ని ప్రశ్నలనే తిప్పితిప్పి విచారణ బృందం అడిగినట్టు తెలిసింది.
విచారణ అధికారులుగా ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రుతిరాజ్, అడిషనల్ ఎస్పీలు శివరాం శర్మ, నరేందర్‌రెడ్డి, కేసు విచారణాధికారి డీఎస్పీ మాజీద్ ఖాన్ కలిసి ఓ ప్రత్యేక గదిలో కేటీఆర్‌ను ప్రశ్నించారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఇచ్చిన అధికారులు, మళ్లీ విచారణ కొనసాగించారు. విచారణకు కేటీఆర్ లాయర్, మాజీ ఏఏజీ రామచందర్రావును ఏసీబీ అధికారులు లోనికి అనుమతించారు. సీనియర్ ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌తోపాటు, హెచ్ఎండీఏ కమిషనర్ దానకిశోర్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్‌ను ఎన్ని ప్రశ్నలు అడిగినా సూటిగా సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. విచారణ అనంతరం తనను ప్రశ్నించిన అధికారులతో కాసేపు కేటీఆర్ మాట్లాడారు.
ఇవి కూడా చదవండి..
Aarogyasri | రూ. 1200 కోట్ల బకాయిలు.. ఆరోగ్య శ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలు నిలిపివేత
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మాజీ ఉప రాష్ట్రపతి అట..!