KTR | వికారాబాద్ : పరిగి నియోజకవర్గంలోని కులకచర్ల మండల పరిధిలోని దాస్యా నాయక్ తండాలో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం కేటీఆర్ జై భీమ్.. జై తెలంగాణ అని నినదించారు. ఈ కార్యక్రమంలో పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురు నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
LIVE : డా. బి. ఆర్. అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ
📍పరిగి నియోజకవర్గం, కుల్కచర్ల మండలం, దాస్య నాయక్ తండా
— BRS Party (@BRSparty) February 1, 2025
ఇవి కూడా చదవండి..