KTR | వరంగల్ : నిన్న రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పరకాలకు చెందిన అరవింద్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ట్విట్టర్ వేదికగా కుటుంబ సభ్యులు అరవింద్ పరిస్థితిని కేటీఆర్కు వివరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ వరంగల్ నగరంలోని గార్డియన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అరవింద్ ఆరోగ్య పరిస్థితిని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ద్వారా తెలుసుకున్నారు. అరవింద్ కుటుంబానికి 50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. ట్విట్టర్ ద్వారా పరిస్థితిని వివరించిన వెంటనే స్పందించి ఆర్థిక సహాయం అందజేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అరవింద్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం.. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ నుంచి పిలుపు!
MLC Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు