KTR | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, చెన్నూరు నియోజకవర్గానికి చెందిన 15 మంది తాజా సర్పంచులు, 10 మంది మాజీ ఎంపీటీసీలు, 1000 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేటీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పదవులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ నేతలకు తెలిసిందొక్కటే.. ఢిల్లీకి సంచులు మోస్తరు గంతే. ఇక్కడున్నోళ్లకు ఏం ఇయ్యరు. తెలంగాణ ప్రజలకు మన్ను కూడా ఇయ్యరు. కానీ ఢిల్లీకి మాత్రం ముఖ్యమంత్రి ఇప్పటికి 62 సార్లు పోయిండని… అన్ని సార్లు ఎందుకు పోతడు. పోయేది మనకోసమో.. రాష్ట్రం కోసమో కాదు. పోయేది కేవలం సంచులు మోసుకపోవాలే.. జీ హుజూర్ అనాలే.. సెల్యూట్ కొట్టాలే.. జర దండం పెడతా.. పోస్టును ఇంకో నాలుగు రోజులు ఉంచు.. నీకింత నాకింత అని మాట్లాడుకోవాలే.. ఆడింత మూట పెట్టాలే. అమ్మా అయ్యా అనుకుంటా దండం పెట్టాలే రావాలే. ఇది కూడా మనం ముందే చెప్పినమన్నారు కేటీఆర్.
ఢిల్లీ పార్టీలకు మన జుట్టు ఇస్తే తెలంగాణ ఆగమైతది.. కాంగ్రెసోడైనా.. బీజేపోడైనా.. ఒకడు సంచులు మోసేటోడు.. ఇంకొకడు చెప్పులు మోసేటోడు. పెద్ద తేడా ఏం లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒకటేమో సంచులు మోసే పార్టీ.. ఇంకొకటేమో చెప్పులు మోసే పార్టీ.. అమిత్ షా రాంగనే చెప్పులు ఎక్కడ విప్పుతరా అని వెనకనే తిరుగుతడు ఒకాయన. ఆయనెవరో మీకు తెలుసు. నేను చెప్ప అన్నారు కేటీఆర్.
ఒకడు సంచులు మోసేటోడు
ఒకడు చెప్పులు మోసేటోడుసంచులు, చెప్పులు మోసుడు తప్ప,
వీళ్లు తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదు.@KTRBRS pic.twitter.com/XEttM41AwD— KTR News (@KTR_News) January 21, 2026
చెన్నూరు నియోజకవర్గానికి చెందిన 15 మంది తాజా సర్పంచులు, 10 మంది మాజీ ఎంపీటీసీలు, 1000 మంది అనుచరులతో కలిసి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి గారు.@KTRBRS @balkasumantrs https://t.co/fomWro0Sgl pic.twitter.com/nYngTGlcLt
— KTR News (@KTR_News) January 21, 2026
Ramagiri : ‘పీజీ పరీక్ష ఫీజు గడువును పొడిగించాలి’
Jharkhand: ఏనుగు బీభత్సం.. 22 మంది మృతి.. జార్ఖండ్‌లో ఎమర్జెన్సీ
Rachel McAdams | రాచెల్ మెక్‌ఆడమ్స్‌కు అరుదైన గౌరవం.. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్‌లో చోటు