KTR | రాజన్న సిరిసిల్ల : రాజకీయంగా నా మీద కోపంతో.. రాజన్న సిరిసిల్ల ప్రజలు, నేతన్నల మీద పగబట్టినట్టు కక్ష తీర్చుకుంటున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. బతుకమ్మ చీరల ఆర్డర్లను బంద్ చేయడంతో నేతన్నలకు సంబంధించిన వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
బతుకమ్మ పండుగ అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ రోజు చాలా బాధాతప్త హృదయంతో మాట్లాడుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం దివాళకోరు నిర్ణయం వల్ల రాష్ట్రంలోని కోటి మందికి పైగా ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు బంద్ అయ్యాయి. బతుకమ్మ చీరల పంపిణీ పథకం వెనుక ఉన్న ఉద్దేశం, ఆలోచనపై ఈ సీఎంకు, ప్రభుత్వానికి కనీస అవగాహన లేదు. నేతన్నల సమస్యలపై శాసనసభలో చెప్పే ప్రయత్నం చేశాను. నా మీద రాజకీక్ష కక్ష ఉంటే నా మీద తీసుకోండి. కానీ నేతన్నలను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేశాను. మూర్ఖపు ప్రభుత్వం ఇది. సిరిసిల్ల స్థితిగతులు తెలియని ప్రభుత్వం ఇది. దివాళాకోరు, పనికిమాలిన ప్రభుత్వం ఇది అని కేటీఆర్ మండిపడ్డారు.
2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో సిరిసిల్లలో ఆత్మహత్యలు జరిగాయి. ఒకటే వారంలో ఆనాడు 9 మంది నేతన్నలు బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పార్లెమంట్ ఎంపీగా కేసీఆర్ చలించిపోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే మా పార్టీ తరపున రూ. 50 లక్షలు పద్మశాలీ ట్రస్ట్‌కు ఇచ్చి సిరిసిల్లను ఆదుకుంటామని కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. ఆ ట్రస్టుకు ఇచ్చిన 50 లక్షల ద్వారా 2 వేల కుటుంబాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేశామని కేటీఆర్ గుర్తు చేశారు.
రాష్ట్రం ఏర్పడ్డాక సిరిసిల్ల వ్యాపరవేత్తలతో నాటి సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేసి.. నేతన్నలను ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేయాలని అడిగారు. మీరు మాకు పని కల్పించాలని వారు కోరారు. పని కల్పించడం కాదు.. గొప్పగా సంపాదించాలంటే ఏం చేయాలో అడిగారు. కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. దానికి అనుగుణంగా.. సిరిసిల్లలో బతుకమ్మ చీరలు తయారు చేయాలని చెప్పారు. ఏడాదికి 8 నెలలు ఏ ఢోకా లేకుండా ఉపాధి కల్పించాలని కడుపు నింపిన మహానుభావుడు కేసీఆర్. స్కూల్ యూనిఫామ్స్, కేసీఆర్ కిట్‌లో ఇచ్చే చీరలు రంజాన్ తోఫా, క్రిస్మస్కు కానుక ఇచ్చే చీరలను సిరిసిల్లలో తయారు చేయించారు కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | అమ్మమ్మ – తాతయ్యల జ్ఞాపకార్థం బడి కట్టించా.. గుడిని కూడా కట్టిస్తా : కేటీఆర్
Rains Alert | తెలంగాణలో మరో రెండురోజులు కొనసాగనున్న వానలు..