KTR | అమ్మమ్మ – తాతయ్యల జ్ఞాపకార్థం బడి కట్టించా.. గుడిని కూడా కట్టిస్తా : కేటీఆర్
KTR | మా అమ్మమ్మ - తాతయ్యల జ్ఞాపకార్థం బడిని కట్టించాను.. గుడిని కూడా కట్టిస్తాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా గుడిని నిర్మించి, కొదురుపాక ప్రజలకు అంకితం చేస్తామని కేటీఆర్ చెప్పారు.
KTR | రాజన్న సిరిసిల్ల : మా అమ్మమ్మ – తాతయ్యల జ్ఞాపకార్థం బడిని కట్టించాను.. గుడిని కూడా కట్టిస్తాను అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా గుడిని నిర్మించి, కొదురుపాక ప్రజలకు అంకితం చేస్తామని కేటీఆర్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో కేశవరావు – లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్థం తన సొంత ఖర్చులతో నిర్మించిన స్కూల్ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈరోజు ఒక శుభదినం. చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా సిరిసిల్లలో నివాళులర్పించి వచ్చాను. కొదురుపాకకు రాజకీయ నాయకుడిలా రాలేదు.. కేశవరావు – లక్ష్మమ్మ మనువడిగా మాత్రమే వచ్చాను. ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ప్రతి ఎండాకాలం సెలవుల్లో ఇక్కడికే వచ్చేవాడిని. బడి మంచిగనే కట్టించారు.. గుడి కూడా పూర్తి చేయాలని మా మామ చెప్పారు. దాన్ని కూడా పూర్తి చేసి రాజకీయాలకు అతీతంగా అంకకితం చేస్తాం. కొదురుపాకకు వచ్చే వాగు దాటుతుంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. గతంలో వాగు పొంగితే రాకపోకలు బంద్ అయ్యేవి. సిరిసిల్ల నుంచి కరీంనగర్ వచ్చే పరిస్థితి లేకుండే. వాగు పెద్దగా లేనప్పుడు నీళ్లల దాటుకుంటూ వచ్చేవాళ్లమని కేటీఆర్ గుర్తు చేశారు.

కొదురుపాక గ్రామం మిడ్ మానేరులో మునిగిపోతుందన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే మా నానమ్మ ఊరు అప్పర్ మానేరులో మునిగిపోయింది. లోయర్ మానేరులో ఇంకో అమ్మమ్మ ఊరు మునిగిపోయింది. మూడు మానేరు డ్యామ్ల్లో మా మూడు రక్త సంబంధీకుల ఇండ్లు పోయాయి. కాబట్టి నిర్వాసితుల బాధలు తెలుసు. నిర్వాసితుల సమస్యలను సాధ్యమైనంత వరకు షరిష్కరించినం. మిగిలిన వారికి ప్రభుత్వంలో ఉండే పెద్దలతో మాట్లాడి న్యాయం చేస్తాం. కొదురుపాకలో బడి పూర్తి కావడంతో మా తాత ఆత్మ సంతోషిస్తదని అనుకుంటున్నాను. కొదురుపాక ఊరికి నా వ్యక్తిగతంగా ఎల్లవేళల అండగా ఉంటాను. గుడి కూడా తప్పకుండా పూర్తి చేసి.. రాజకీయాలకు అతీతంగా సఖ్యతగా ప్రారంభించుకుందామని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఇన్నోవేటివ్ థింకింగ్ అంటే ఏమిటి..? రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన కేటీఆర్
KTR | రెండు చీరలు ఇస్తానన్న ముఖ్యమంత్రి ఏమై పోయావ్.. బతుకమ్మ చీరల బంద్పై కేటీఆర్ ఫైర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

