KTR | రంగారెడ్డి : రాష్ట్రంలోని మనషులనే కాదు.. చివరకు దేవుళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేసిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని ప్రతి వర్గాన్ని రేవంత్ మోసం చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరులో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రూ. 2 లక్షల వరకు రుణాలు తెచ్చుకోండి.. డిసెంబర్ 9న మొదటి సంతకం చేసి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ ఇప్పటి వరకు రుణమాఫీ పూర్తి కాలేదు. రేవంత్ పరిపాలన పది నెలలు నిండేందుకు వచ్చింది.. కానీ రుణమాఫీ పూర్తిగా మాఫీ కాలేదు. సెక్రటేరియట్లో ప్రభుత్వ పరిపాలన యంత్రాంగం ఉంటుంది. కానీ సీఎం మాత్రం లంకె బిందెలు ఉంటాయని సెక్రటేరియట్ వెళ్లిండట. ఇలాంటోడు మన ముఖ్యమంత్రి. చివరకు కనిపించిన దేవుడి మీద ఒట్టు పెట్టి.. పంద్రాగస్టు వరకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఏ దేవుడిని విడిచి పెట్టలేదు. మనషులనే కాదు చివరకు దేవుళ్లను కూడా మోసం చేసిండు చిట్టి నాయుడు అని కేటీఆర్ మండిపడ్డారు.
కందుకూరులో మనం చేసే లొల్లి దేశానికి తెలియొద్దని రేవంత్ కుట్ర చేస్తున్నాడు. సీఎం కుర్చీని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుండు. దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు. ఇవాళ సన్న వడ్లకు ఇస్తా అంటుండు. రుణమాఫీ, బోనస్, రైతు బంధు పేరుతో మోసం చేసిండు. అటుకాకుండా ఇటుకాకుండా రైతుల పరిస్థితి తయారైంది. రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని రేవంత్ మోసం చేసిండు. ఇంట్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తా అన్నాడు. కోడళ్లకు కూడా ఇస్తా అన్నాడు. బతుకమ్మ చీరలు లేనే లేవు. దసరా పండుగ పండుగలా లేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఆరు గ్యారెంటీలు నూరు రోజులు.. ఆరునైరైనా అమలు చేస్తా అన్నాడు. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నాడు.. ఇప్పుడేమో ఉన్న ఇండ్లను కూలగొడుతున్నాడు అని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Charminar | ఏం సాహసం.. చార్మినార్‌పై ప్రమాదకరంగా నడిచిన వ్యక్తి.. వీడియో
Govt Hospitals | ఇది మీ జిల్లా కాదు.. ఇక్కడ మీకు కాన్పు చేయం.. రేవంత్ పాలన ఇదీ..
KTR | మూసీ వెనక దాక్కున్న ముసుగు దొంగ ఎవరు..? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్