KTR | పోరాటాలు మనకు కొత్త కాదు.. ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు : కేటీఆర్
KTR | సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడం.. ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గుంపు మేస్త్రీ అంటే కట్టేతోడు.. ఈ చిట్టినాయుడు కూల్చేటోడు అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి ఉడుత ఊపులకు భయపడం.. ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. గుంపు మేస్త్రీ అంటే కట్టేతోడు.. ఈ చిట్టినాయుడు కూల్చేటోడు అని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్వీ సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసమే టీఆర్ఎస్ ఆవిర్భావించింది. 14 ఏండ్లు ఎన్నో ఉద్యమ పోరాటాల్లో విద్యార్థి నాయకులు కథానాయకులగా వ్యవహరించారు. కదనరంగంలో విజృంభించి కొట్లాడి ప్రాణత్యాగం చేసిన ప్రతి అమరవీరుడికి పాదాభివందనం. పోరాటం మనకు కొత్త కాదు. 14 ఏండ్ల కొట్లాడాం. పెద్ద పెద్ద నాయకులతో కొట్లాడినం. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు వంటి నాయకులతో తలపడి చివరకు తెలంగాణ తెచ్చాం. మరి ఈ చిట్టి నాయుడు మనకు ఓ లెక్క కాదు అని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉంది అంటడు రేవంత్ రెడ్డి. ఏ రాయితో నెత్తి పగులగొట్టుకోవాల్నో తెలుస్తలేదు. మొన్న ఓ సారి మాట్లాడుతూ.. మన తెలంగాణలో భాక్రా నంగల్ డ్యామ్ ఉందని చెప్పిండు. రేవంత్ రెడ్డి వల్ల ఇన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రకారం విప్రో సీఈవో సత్య నాదెళ్ల.. ఆయనకు ఏం తెల్వదు.. ఎవడన్న చెప్పబోతే వినడు. పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది రాష్ట్రం పరిస్థితి ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం మనం ప్రజలను చైతన్యవంతులను చేయాలి. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కేసీఆర్ పోరాటం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో జిల్లాకో మెడికల్ కాలేజీ లేదు. జిల్లాకో నర్సింగ్ లేదు. గురుకుల పాఠశాలలు 1000 పైచిలుకు లేవు. కానీ ఇవన్నీ తెలంగాణలో ఉన్నాయి. గురుకులాల్లో ఒక్కో విద్యార్థి మీద లక్షా 25 వేలు ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ మనం సాధించిన విజయాలు అని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Manda Krishna Madiga | మరో ఉద్యమానికి మాదిగ, ఉపకులాలు సిద్ధం కావాలి.. మందకృష్ణ మాదిగ పిలుపు
Group-1 | గ్రూప్-1 అభ్యర్థులతో కేటీఆర్ సమావేశం..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- BRSV
- Congress govt
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

