Manda Krishna Madiga | హైదరాబాద్ : మాదిగలను నమ్మించి నమ్మక ద్రోహానికి పాల్పడ్డ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై మరో ఉద్యమానికి సిద్ధంగా ఉండాల్సింది మాదిగ, ఉపకులాలకు పిలుపునిస్తున్నామని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు.
ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన నిండు శాసనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ తొలుత దేశంలో తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తదని హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందన్నారు. ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఎస్సీ రిజర్వేషన్ల అమల్లో పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు ముందు వసరులో ఉన్నాయని మందకృష్ణ తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న రేవంత్ మాటలకు విలువ లేకుండా పోయింది. తేనే పూసిన కత్తిలా ఆయన మాటలు ఉంటాయి. ప్రజలను నమ్మించడంలో ఘనుడే.. మోసం చేయడంలో అంతకంటే ఘనుడు. మాదిగల పట్ల ఆయన మాటలు తేనే పూసినట్టు ఉంటాయి. కానీ అవి మాకు తీపిని అందించవు. మాకు చేదుగానే, మోసంగానే ఉంటాయని మందకృష్ణ తెలిపారు.
పరీక్షల నిర్వహణ కానీ అన్ని నోటిఫికేషన్లలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి శాసనసభా వేదికగా చెప్పాడు. దీన్ని కూడా ఆయన విస్మరించాడు. ఇవాళ మాదిగల పొట్ట కొట్టింది రేవంత్ ప్రభుత్వం. 11 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసి అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించారు. ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే అంతకుముందున్న నోటిఫికేషన్లకు కూడా వర్గీకరణ అమలు చేస్తామన్న రేవంత్.. అది అమలు చేయకుండానే నియామక పత్రాలు అందజేశారు. ఇంది మాదిగ బిడ్డల పొట్ట కొట్టినట్టు కాదా..? అని రేవంత్ రెడ్డిని మందకృష్ణ మాదిగ నిలదీశారు.
ఇవి కూడా చదవండి..
Road Accident | వికారబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
Group-1 Mains | గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
Group-1 | గ్రూప్-1 అభ్యర్థులతో కేటీఆర్ సమావేశం..