KTR | హైదరాబాద్ : ఏసీబీ ఆఫీసు వద్ద మీడియా ప్రతినిధుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఏసీబీ విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతుండగా.. కవరేజ్ కోసం ప్రయత్నించిన పలువురి జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును గ్రహించిన కేటీఆర్.. మీడియాపై దాడి ఎందుకు.. ఇక్కడ మాట్లాడితే మీ సమస్య ఏంటి..? అని డీసీపీని ప్రశ్నించారు. మీడియాతో మాట్లాడితే భయమెందుకు అవుతుందని డీసీపీని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసుల తీరుపై అటు జర్నలిస్టులు, ఇటు బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.
ఇక కేటీఆర్‌ను ఏసీబీ విచారిస్తున్న సమయంలో బయట ఉన్న జర్నలిస్టుల పట్ల కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పలువురి జర్నలిస్టులపై పోలీసులు చేయి చేసుకున్నారు. మీడియా అని చెబితే కూడా వినకుండా ఓ రిపోర్టర్ కాలర్ పట్టుకుని ఓ పోలీసు అధికారి లాగేశారు. మరో రిపోర్టర్ పట్ల కూడా పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఏసీబీ కార్యాలయం నుంచి వెళ్లిపోవాలని కొందరు పోలీసు అధికారులు జర్నలిస్టులను ఆదేశించారు. మీలాగే మేం కూడా డ్యూటీలు చేస్తున్నామని జర్నలిస్టులు చెప్పినప్పటికీ పోలీసులు వినిపించుకోకుండా తమ పైత్యాన్ని ప్రదర్శించారు.
మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్న పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం pic.twitter.com/4VZxdDGdyd
— Telugu Scribe (@TeluguScribe) January 9, 2025
పోలీసుల అత్యుత్సాహం
ఏసీబీ ఆఫీస్ వద్ద సీనియర్ జర్నలిస్టుల మీద చేయి చేసుకున్న పోలీసులు pic.twitter.com/kBOBF8S2Jd
— Telugu Scribe (@TeluguScribe) January 9, 2025
ఇవి కూడా చదవండి..
KTR | నాలుగైదు ప్రశ్నలను నలభై రకాలుగా అడిగారు.. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్
Revanth Reddy | జులై 6 లోగా పాస్‌పోర్టు తిరిగి అప్పగించండి.. సీఎం రేవంత్‌కు ఏసీబీ కోర్టు ఆదేశం
RS Praveen Kumar | కేటీఆర్ గారూ.. సత్యం మీ వైపే ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్