KTR | హైదరాబాద్ : ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. కేసీఆర్ సర్కార్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చూసుకున్నారు. కానీ కాంగ్రెస్ సర్కార్ మాత్రం వైద్యానికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మొండి వైఖరితో 20 లక్షల కుటుంబాలు ఇబ్బందుల్లో పడ్డాయని పేర్కొన్నారు. తక్షణం మా ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేసి ఉద్యోగులకు ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
తెలంగాణ ఉద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు
ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను అమలు చెయ్యని కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వ ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లా చుసిన కేసీఆర్ సర్కార్-వైద్యానికి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడ్తున్న… pic.twitter.com/Y9D6aba1O9
— KTR (@KTRBRS) September 20, 2024
ఇవి కూడా చదవండి..
Current Charges | త్వరలో కరెంట్ షాక్! నూతన సంవత్సర కానుకగా విద్యుత్తు చార్జీల పెంపుదల తప్పదా?
Rythu Bharosa | కౌలురైతుకు భరోసా ఇవ్వలేం.. కుండబద్దలు కొట్టిన మంత్రి తుమ్మల
Mee Seva | స్తంభించిన ‘మీ’ సేవలు.. పది రోజులుగా నిలిచిన సర్టిఫికెట్ల జారీ