KTR | రంగారెడ్డి : దిక్కుమాలిన మాటలు, రోతపుట్టించే మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఆయన మంత్రివర్గాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా త్వరలోనే పరువు నష్టం దావా వేస్తానని కేటీఆర్ తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరులో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
దిక్కుమాలిన నోటలు, రోత పుట్టించే మాటలు మాట్లాడే ముఖ్యమంత్రిని విడిచిపెట్టం. నీ గబ్బు మాటలకు నీ మంత్రుల చెడ్డ మాటలకు సమాధానం చెబుతాం.ఇక నుంచి వదిలిపెట్టం. నాపై ఆరోపణలు చేసిన మంత్రిపై ఆల్రెడీ పరువు నష్టం దావా వేశాను. ముఖ్యమంత్రి మీద కూడా తొందర్లనే వేస్తా.. అడ్డగోలుగా మాట్లాడిన మంత్రిగారిని విడిపెట్టను.. క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టను. అటు క్రిమినల్, ఇటు సివిల్ డిఫమేషన్ రెండు సూట్లు వేస్తాను.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తప్పే చేయనుప్పుడు ఎవని అయ్యకు కూడా భయపడం. ఏం చేసుకుంటవో చేస్కో అని మోదీకే చెప్పినం. ఈ చిట్టి నాయుడు ఎంత మనకు.. అడ్డిమారి గుడ్డి దెబ్బలో సీఎం అయిండు. ఇక ఆగుతలేడు. పెద్దోని అయిపోయానని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు అని కేటీఆర్ మండిపడ్డారు.
సబితక్క ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌస్‌లు ఉన్నాయట. మరి అవి ఎక్కడున్నాయో చెబితే మేమే కూలగొడుతాం. సబితక్క బిడ్డకు కూడా ఉందట. అది కూడా చూపిస్తే కూలగొడుతాం. మాట్లాడితే కూలగొడుతా అంటున్నావ్.. అది నీ ఇష్టం. రేవంత్ రెడ్డి నీ కళ్లు చల్లబడుతాయి అనుకుంటే.. మావి కూలగొట్టి అక్కడికి ఆపేయ్. పేదవాళ్లవి మాత్రం కూలగొట్టకు.. వారి ఇండ్లను ముట్టుకోవడం బంద్ చేయ్. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక దిక్కేమో రైతు గోస.. హైదరాబాద్ పోతే మూసీ బాధితుల రోదన. మూసీ పరివాహక ప్రాంతంలో 50 ఏండ్ల నుంచి ఇల్లు కట్టుకుంటే ఆక్రమణదారులు, కబ్జాదారులు అంటున్నాడు రేవంత్ రెడ్డి. మీ కాంగ్రెస్ ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేసే.. ఇన్ని రోజులు పైసలు దొబ్బితింటివి. ఇప్పుడేమో కబ్జాకోరులు అని మాట్లాడుతున్నావు. నీకు చిత్తశుద్ధి ఉంటే.. కొడంగల్‌లోని రెడ్డి కుంటలో నీ సొంత ఇల్లు ఉంది.. దమ్ముంటే దాన్ని కూలగొట్టి.. పేదోళ్ల వద్దకు రా అని సవాల్ చేస్తున్నా. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న మీ అన్న తిరుపతి రెడ్డి ఇల్లు కూలగొట్టు. అప్పటికీ కడుపు మంట చల్లారకంటే మావి కూలగొట్టు.. కానీ పేదల ఇండ్ల వద్దకు రావొద్దని కేటీఆర్ చెప్పారు.
నీకు పైసలు, కమిషన్లు కావాలి. రాహుల్ గాంధీకి పంపాలి.. కుర్చీ కాపాడుకోవాలి. నీ బాధ అర్థమవుతుంది. నీకు అంత పైసల పిచ్చి ఉంటే.. నాలుగు కోట్ల మందిమి చందాలు వేసుకునే నీ ముఖాన కొడుతాం. కానీ పేదల ఇండ్లు కూలగొట్టకు.. చందా పైసలను తీసుకెళ్లి ఢిల్లీకి కప్పం కట్టి.. ముఖ్యమంత్రి పదవి కాపాడుకో అని కేటీఆర్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి, మంత్రుల నోట్లోనే ఉంది.. కేటీఆర్ తీవ్ర విమర్శలు
KTR | మనషులనే కాదు.. చివరకు దేవుళ్లను కూడా మోసం చేసిండు.. రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం
TG Rains | తెలంగాణలో మూడురోజులు వర్షాలు.. హైదరాబాద్ సహా 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ