KTR | రంగారెడ్డి : మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి, మంత్రుల నోట్లోనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా పని చేయడం లేదు.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని కందుకూరులో ఏర్పాటు చేసిన రైతు ధర్నాలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ ప్రభుత్వం ఈ పది నెలల్లో కొత్తగా సాధించింది ఏం లేదు.. కానీ రెండు జరుగుతున్నాయి. మూసీ సుందరీకరణ కోసం లక్షా 50 వేల కోట్లు ఖర్చు పెడుతా అంటుండు. రైతుబంధు, ఆసరా పెన్షన్లు, రుణమాఫీకి పైసల్లేవట. కానీ లక్షా 50 వేల కోట్లు మూసీలో పోస్తాడట. ఎందుకో తెలుసా..? రైతుబంధు, పెన్షన్లు, తులం బంగారం ఇస్తే మీరు కమిషన్ ఇవ్వరు. కానీ అదే మూసీలో 30 వేల కోట్లు దొబ్బి ఢిల్లీకి మూటలు పంపాలి. అందుకు మూసీ పథకం పెట్టిండు. కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, పాలమూరు 90 శాతం కట్టిండు. నీళ్లు ఇచ్చేందుకు కట్టిండు. మరి మూసీతో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తావు…? సమాధనం ఉందా..? అంటే లేదు. కమిషన్లు దొబ్బేందుకు ప్లాన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకు కమిషన్ల పిచ్చి పట్టింది. పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అమలు చేస్తే పైసలు రావు.. కాబట్టి మూసీ పేరు మీద బ్యూటిఫికేషన్ కాకుండా లూటిఫికేషన్ చేస్తే కాంగ్రెసోళ్లకు డబ్బులు పంపి.. కుర్చీని కాపాడుకునేందుకు రేవంత్ రెడ్డి యత్నిస్తున్నాడని కేటీఆర్ పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో 14 వేల ఎకరాలు ఫార్మా సిటీకి సేకరించాం. ఇదే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోదండ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, రేవంత్ రెడ్డి ఊరురు తిరిగి చెప్పిండ్రు.. బస్సు యాత్రలు పెట్టి చెప్పిండ్రు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫార్మా సిటీ రద్దు చేసి తిరిగి రైతులకు భూములు ఇస్తామన్నారు. కానీ మాట మార్చారు. ఫార్మా సిటీ పేరు మార్చి ఫోర్త్ సిటీ అని పెట్టిండు. ఇంకోటి ఫ్యూచర్ సిటీ అట. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగంలో రాష్ట్ర ప్రభుత్వమే పనులు చేస్తదట. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నియోజకవర్గంలో కమిషన్లు, కాంట్రాక్టుల కోసం అలైన్మెంట్ మార్చి తమ భూములను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్లా పని చేస్తున్నాడు.. ముఖ్యమంత్రిలా పని చేయడం లేదు.. మాట్లాడితే మూసీ, హైడ్రా అంటున్నాడు. చేయాల్సింది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ గబ్బంతా ముఖ్యమంత్రి, మంత్రుల నోట్లనే ఉంది. వాళ్ల నెత్తుల నిండా గబ్బు ఉన్నదని కేటీఆర్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణలో మూడురోజులు వర్షాలు.. హైదరాబాద్ సహా 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
KTR | మనషులనే కాదు.. చివరకు దేవుళ్లను కూడా మోసం చేసిండు.. రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం
Govt Hospitals | ఇది మీ జిల్లా కాదు.. ఇక్కడ మీకు కాన్పు చేయం.. రేవంత్ పాలన ఇదీ..