SLBC Tunnel | హైదరాబాద్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ప్రమాదం జరిగి ఏడు రోజులు అవుతున్నప్పటికీ.. 8 మంది కార్మికుల ఆచూకీ గురించి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతి మంత్రి తనకు ఇష్టమొచ్చిన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మృతదేహాలు లభ్యమయ్యాయని చెబుతుండు. మరో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ ఎందుకు సంతాపం తెలుపడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఓ మంత్రి మాట్లాడుతూ.. ఎవరూ బతికి లేరని చెబుతున్నారు. ఏమిటీ ఈ సర్కస్ అని కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు తల లేని కోళ్లు తిరిగినట్లు తిరుగుతున్నారు. కార్మికుల ఆచూకీ కోసం వారి కుటుంబాలు వేచి చూస్తున్నాయి. కనీసం ఒక్కరయినా బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు! ఒక్క అఫిషియల్ ప్రెస్ రిలీజ్ లేదు! ఇదేనా మీరు, మీ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చే గౌరవం? ఇదేనా మీ ప్రభుత్వంలో ప్రాణాలకుండే విలువ..? అందుకే అంటాను ఇది ప్రభుత్వం కాదు సర్కస్ అని! కేటీఆర్ ఎద్దెవా చేశారు. మిస్టర్ సీఎం.. కొంత బాధ్యత తీసుకొని కనీసం అధికారిక ప్రకటన విడుదల చేయగలరా? ఇప్పటికే మీ డ్రామా హాస్యాస్పద స్థాయికి చేరుకుందని కేటీఆర్ పేర్కొన్నారు.
There is an unsettling amounts of misinformation around the whereabouts of the 8 workers trapped inside the SLBC tunnel for the last 7 days
Each minister has his own statement. One MLA says dead bodies were discovered. Another MLA asks why PM Modi didn’t send his condolences. A…
— KTR (@KTRBRS) March 1, 2025
ఇవి కూడా చదవండి..
Ramzan | ఉర్దూ మీడియం విద్యార్థులకు గుడ్న్యూస్.. రేపట్నుంచి ఒంటి పూట బడులు
KTR | కేసీఆర్ తిరిగి సీఎం అయితేనే.. తెలంగాణ అవ్వల్ దర్జాగా నిలుస్తుంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KTR | తెలంగాణ ఈజ్ డెఫినెట్లీ రైజింగ్.. ఎందులో అంటే..? రేవంత్ పాలనపై కేటీఆర్ సెటైర్లు