Ramzan | హైదరాబాద్ : రంజాన్ పండుగ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపవాస దీక్షల నేపథ్యంలో రేపట్నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉర్దూ విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇక నెలవంక కనిపించడంతో.. రేపట్నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు.