హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు(Heavy rains) పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పంటలు దెబ్బతిన్నాయి.ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో వరద బాధితులను (Flood victims) ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు(BRS MPs ), ఎమ్మెల్యేలు( BRS MLAs) ముందుకొచ్చారు.
తమ వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి ఒక నెల జీతం(One month salary )విరాళంగా (Donation) ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు బుధవారం సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్ రావు విరాళాలను ప్రకటించారు. కాగా, ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్యర్యంలో సహాయక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.
Also read..