MLC Kavitha | హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఘన విజయం సాధించిన టీమిండియా అండర్-19 వుమెన్స్ జట్టుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ముద్దుబిడ్డ గొంగడి త్రిషపై ప్రత్యేక ప్రశంసల జల్లు కురిపించారు కవిత. ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆమె అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన త్రిషను ప్రత్యేకంగా కవిత అభినందించారు. దేశానికి, తెలంగాణకు ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు. మరోసారి టీ20 వరల్డ్ కప్‌ను తీసుకొచ్చినందుకు వుమెన్స్ జట్టుకు ధన్యవాదాలు తెలిపారు కవిత.
వుమెన్స్ అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. సఫారీ జట్టు నిర్దేశించిన 83 పరుగుల లక్ష్యాన్ని, టీమిండియా అమ్మాయిలు 11.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి ఛేదించారు. గొంగడి త్రిష 33 బంతుల్లో 44 పరుగులు (8×4) చేసి నాటౌట్‌గా నిలిచింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 82 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్ల విజృంభనతో సఫారీ జట్టు విలవిల్లాడింది. మికీ వాన్ (23 పరుగులు)టాప్ స్కోరర్. నలుగురు ప్లేయర్లు పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. భారత జట్టు బౌలర్లలో త్రిష 3, పరునిక, ఆయూషి, వైష్ణవి తలో 2, షబ్నమ్ 1 వికెట్ తీశారు.
Congratulations to the Under-19 Women’s Cricket Team for winning and retaining the T20 World Cup.
Special applause to Telangana’s Trisha Gongadi on her excellent innings today and for winning Player of the Tournament. Proud moment for India and Telangana!
Thank you for… pic.twitter.com/RmJzjO86Ye
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 2, 2025
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | జనగణన ఇంకెప్పుడు చేస్తారు..? కేంద్రాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
KTR | అన్నపూర్ణ తెలంగాణను.. ఏడాదిలో ఆత్మహత్యల తెలంగాణగా చేశారు: కేటీఆర్
Electricity Demand | జనవరిలోనే సమ్మర్ తరహాలో.. రికార్డుస్థాయికి విద్యుత్తు డిమాండ్