SC, ST Commission | అసెంబ్లీ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై పార్టీ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, విజయుడు, మాణిక్ రావు, అనిల్ జాదవ్ బషీర్ బాగ్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
మేం శాసనసభ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్నసమయంలో పోలీసులు మా పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా దుర్భాషలాడుతూ శారీరకంగా దాడికి పాల్పడ్డాడు. కేవలం మాపై జరిగిన దాడిగా కాదు.. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని ఎమ్మెల్యేలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ బయట ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.
బషీర్ బాగ్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, విజయుడు, మాణిక్ రావు, అనిల్ జాదవ్
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యేలు
అసెంబ్లీ బయట ఎమ్మెల్యేలకు జరిగిన అవమానంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ https://t.co/DgR9OtZwz0 pic.twitter.com/dcDrCm0paS
— Telugu Scribe (@TeluguScribe) September 7, 2026
ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలి : డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్