Anil Ravipudi | రామాయణంతో అనిల్ రావిపూడి కొత్త ప్రయోగం.. భారీ యానిమేటెడ్ మూవీపై ఇంట్రెస్టింగ్ టాక్
Anil Ravipudi | దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. రామాయణం నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో ఓ భారీ యానిమేటెడ్ చిత్రం రూపొందనుందనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.
Anil Ravipudi | దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. రామాయణం నేపథ్యంలో ఆయన దర్శకత్వంలో ఓ భారీ యానిమేటెడ్ చిత్రం రూపొందనుందనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-విజువలైజేషన్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, కథకు అనుగుణంగా భారీ స్థాయిలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్‌ను రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. కామెడీ, భావోద్వేగాలు, కుటుంబ అంశాలతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్‌ను తనదైన శైలిలో తెరకెక్కించడం అనిల్ రావిపూడి ప్రత్యేకత. అలాంటి దర్శకుడు రామాయణం వంటి పౌరాణిక ఇతిహాసాన్ని యానిమేటెడ్ రూపంలో ఎలా ఆవిష్కరిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం.. ఈ ప్రాజెక్ట్‌లో రామాయణంలోని కీలక ఘట్టాలను ఆధునిక యానిమేషన్ సాంకేతికతతో భారీ స్థాయిలో చూపించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అయోధ్య, లంక, వానరసేన, రామసేతు, యుద్ధ సన్నివేశాలు వంటి కీలక ఘట్టాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణ యానిమేటెడ్ చిత్రాలకు భిన్నంగా అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్స్‌ను రూపొందించే దిశగా ప్రీ-విజువలైజేషన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
ఈ భారీ ప్రాజెక్ట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గౌర హరి సంగీతం అందించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే దర్శకుడు, నిర్మాతలు, నటీనటులు, కథకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. యానిమేషన్ చిత్రంగా రూపొందితే ఈ సినిమాను కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితం చేయకుండా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని వివిధ భాషల్లో విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రీ-విజువలైజేషన్ పనులు పూర్తయ్యాయన్న వార్తల నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే అనిల్ రావిపూడి కెరీర్లో ఇది పూర్తిగా భిన్నమైన ప్రయత్నంగా నిలిచే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
Donald Trump: భారత్, అమెరికా మధ్య త్వరలో కొత్త ట్రేడ్ డీల్: డోనాల్డ్ ట్రంప్
Warangal | వరంగల్‌లో రావణ వధ వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం.. తొక్కిసలాట
Tiger Shroff | అసలు టార్గెట్ అగ్రహీరో.. కుదరకపోవడంతో టైగర్ ష్రాఫ్‌పై దాడి..!
రెడ్ డ్రెస్‌లో మీనాక్షి చౌదరి అందాలు.. ట్రెండీ లుక్‌లో అదరగొట్టిన భామ!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

