Padi Kaushik Reddy | హైదరాబాద్ : పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దానం, కడియం లాంటి చీటర్లు ఈ ప్రపంచంలోనే లేరు అని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మిస్టర్ దానం నాగేందర్ సాబ్.. బిచ్చగానివి నువ్వు.. అని నేను అనలేదు.. మీ ముఖ్యమంత్రే నువ్వో బిచ్చగానివి.. ఓ బార్ దగ్గర బీడీలు అమ్ముకుంటున్నావని రేవంత్ రెడ్డే అన్నారు. పూటకో పార్టీ మారేది.. పూటకో మాట మాట్లాడేది నువ్వు కదా..? కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు.. అటునుంచి తెలుగు దేశంలోకి వెళ్లావు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావు.. అటునుంచి బీఆర్ఎస్లోకి వచ్చావు.. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరావు. యూ ఆర్ నేమ్డ్ యాజ్ ఏ చీటర్ ఆఫ్ హైదరాబాద్.. నీ కంటే పెద్ద చీటర్ ఈ ప్రపంచంలోనే లేడు. ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నావ్. మొన్న బీఆర్ఎస్ పార్టీని చీట్ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి, సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ప్రజలు నీకు బుద్ది చెప్పారు. నువ్వు రేపు ఎమ్మెల్యేగా కాదు.. మాజీ ఎమ్మెల్యేగా శాశ్వతంగా మిగిలిపోతావు. ఇది గ్యారెంటీ దానం నాగేందర్ రాసి పెట్టుకో అని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు.
ఇక కడియం శ్రీహరి మాట్లాడుతున్నడు.. రెండో బెంచ్ ఉన్నదట. ఇక మూడో బెంచ్ కూడా ఉంటదట. మీకు సిగ్గులు, శరాలు లేవా..? పార్టీలు మారినోళ్లకు. లజ్జ, మానం, ఇజ్జత్ లేనోళ్లా మీరు..? మీరు మొగోళ్లే కదా..? మీకు దమ్ముంటే రాజీనామా చేసి, ఎలక్షన్లకు రండి.. ప్రజలు జవాబు చెబుతారు కదా..? కడియం శ్రీహరి పచ్చి మోసగాడు. నేనేదో పెద్ద క్యారెక్టర్ మనిషినని చెప్పుకుని పెద్ద బిల్డప్ ఇస్తాడు. ఆయనంత పెద్ద చీటర్ని ఈ ప్రపంచంలో చూడలేదు. ఎందుకంటే పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు చేసినప్పుడు.. పోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఇదా నీ క్యారెక్టర్. యూ ఆర్ ఏ చీటర్. యూ ఆర్ క్యారెక్టర్ లెస్ ఫెలో. నీకు క్యారెక్టరే లేదు.. కాబట్టి నీతులు మాట్లాడాల్సిన అవసరం లేదు అని పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు.
ఇవి కూడా చదవండి..
Mahabubnagar | ఏ తల్లి కన్న బిడ్డో..ఆడ శిశువును రోడ్డుపై వదిలేసిన వెళ్లిన దుండగులు
KTR | కాంగ్రెస్ పాలనలో మరో కుంభకోణం జరుగుతున్నట్లు అనిపిస్తోంది : కేటీఆర్