Pawan Kalyan | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం ఉదయం సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ. కోటి విరాళాన్ని ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆ సహాయార్ధానికి సంబంధించిన చెక్కును నేడు సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ అందజేశారు. అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో పవన్ భేటీ కావడం ఇదే తొలిసారి.
తెలుగు రాష్ట్రాలకు పవన్ కల్యాణ్ రూ. 6 కోట్ల ఆర్థిక సాయాన్ని సెప్టెంబర్ 4న ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ, ఏపీకి రూ. కోటి చొప్పున, మిగతా రూ. 4 కోట్లు ముంపునకు గురైన 400 గ్రామాల్లో సహాయక చర్యల నిమిత్తం ప్రకటించిన విషయం విదితమే.
ఇవి కూడా చదవండి..
Gachibowli | గచ్చిబౌలిలో రేవ్ పార్టీ.. 18 మంది అరెస్ట్
KTR | స్విమ్మర్ వ్రితి అగర్వాల్‌పై కేటీఆర్ ప్రశంసల జల్లు
Harish Rao | పసికందును పీక్కుతిన్న కుక్కలు.. మనసు కలిచివేసిందన్న హరీశ్‌రావు