Gachibowli | హైదరాబాద్ : గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గెస్ట్ హౌస్లో నిర్వహించిన రేవ్ పార్టీని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. 18 మంది యువతీయువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ 18 మందిలో ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్, సినీ రంగానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ఆరుగురు యువతులు ఉన్నట్లు తెలుస్తోంది.
నిందితుల నుంచి గంజాయి ప్యాకెట్లు, ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బర్త్ డే పార్టీ సందర్భంగా రేవ్ పార్టీ నిర్వహించినట్లు సమాచారం. ముగ్గురు డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది.
ఇవి కూడా చదవండి..
Mahabubnagar | ఏ తల్లి కన్న బిడ్డో..ఆడి శిశువును రోడ్డుపై వదిలేసిన వెళ్లిన దుండగులు
Mahbubnagar | దొంగతనానికి వచ్చి.. కరెంట్ షాక్తో ఇద్దరు దొంగలు మృతి
BRS MLAs | అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు