హైదరాబాద్ : ఏ తల్లి కన్న బిడ్డో.. క్షణికావేశంలో చేసినా ఆ తల్లి తప్పో లేక ఏ కాంమాంధుడి చేతిలో మోసపోయిందే తెలియదు కాని నవ మాసాలు మోసి కన్న పసిగుడ్డు( Baby girl) అడ్డు తొలగించుకో వాలనుకున్నారు. అభం శుభం తెలియని అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలేసి వెళ్లారు. ఈ అమానవీయకర సంఘటన మహబ్నగర్ జిల్లా(Mahabubnagar) దేవరకద్ర మండలం డోకూర్ గ్రామ గేట్ దగ్గర చోటు చేటు చేసుకుంది.
గమనించిన స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు శిశువును జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్(ICDS) కేంద్రానికి తరలించారు. కాగా, ఎవరైనా పిల్లలు వద్దనుకుంటే తమకు సమాచారం ఇవ్వాలని బాలల పరిరక్షణ అధికారులు సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అంతేతప్పా రోడ్లపై అనాథలుగా చిన్నారులను వదిలివెళ్లడం సరైంది కాదన్నారు. పిల్లలు లేని వారికి చట్టబద్ధంగా అందజేస్తామన్నారు.