BRS MLAs | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి కలిశారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తాము వేసిన పిటిషన్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పు అమలుకు చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి పిటిషన్ సమర్పించారు.
దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని హైకోర్టు చెప్పింది. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడాలి అంటే ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలి. కాలయాపన చేయకుండా చర్యలు ప్రారంభించాలని అసెంబ్లీ సెక్రటరీకి వినతిపత్రం ఇచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
‘పార్టీ మారి తప్పు చేశామా?’- ఇదీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో మొదలైన అంతర్మథనం. ‘నిన్నమొన్నటిదాకా ఏం కాదులే అనుకున్నాం. కానీ, హైకోర్టు తీర్పుతో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏంచేయాలో అర్థం కావడం లేదు. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టే ఉన్నది’ అని పార్టీ మారిన ఎమ్మెల్యే ఒకరు తన సన్నిహితులతో వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్నదని, ఆ పార్టీ శ్రేణులు సహకరించడం లేదని, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరగుతున్నదని ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు వస్తే తట్టుకొని నిలబడటం కష్టమని సదరు ఎమ్మెల్యే మథనపడుతున్నారని ఆయన అనుచరులు బాహాటంగానే చెప్తున్నారు. గద్వాల, భద్రాచలం, స్టేషన్‌ఘన్‌పూర్, జగిత్యాల, బాన్సువాడ, చేవెళ్ల, పటాన్చెరు, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్, రాజేంద్రనగర్ ఈ పది నియోజకవర్గాల్లో హైకోర్టు తీర్పు హాట్‌టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | పసికందును పీక్కుతిన్న కుక్కలు.. మనసు కలిచివేసిందన్న హరీశ్‌రావు
KTR | స్విమ్మర్ వ్రితి అగర్వాల్‌పై కేటీఆర్ ప్రశంసల జల్లు
KTR | కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారింది.. కేటీఆర్ ధ్వజం