జెరుసలాం: లెబనాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ హిజ్బుల్లా.. బుధవారం రాత్రి ఇజ్రాయెల్‌పై భీకర దాడికి పాల్పడింది. ఒక్క రాత్రే సుమారు 200 రాకెట్ల(Hezbollah Rockets)ను ఫైర్ చేసింది. ఇజ్రాయెల్ ఉత్తరం వైపున ఆ దాడి జరిగింది. దీంతో వేల సంఖ్యలో ఇజ్రాయిలీ ప్రజలు ప్రాణ రక్షణ కోసం షెల్టర్లకు వెళ్లి దాక్కున్నారు. హిజ్బుల్లా గత వారం రోజుల్లో తొలి సారి భారీ ఎత్తున బుధవారం రాత్రి దాడి చేసింది. ఇరాన్‌కు మద్దతుగా ఇజ్రాయెల్‌పై హిజ్బుల్లా అటాక్ చేస్తున్న విషయం తెలిసిందే.
బుధవారం జరిపిన దాడిలో తొలుత ఒకేసారి సుమారు వందకు పైగా రాకెట్లను ఫైర్ చేసింది. రాత్రి 8 గంటలకు ఆ ఫైరింగ్ జరిగింది. మరో వైపు అదే సమయంలో ఇరాన్ ఓ క్షిపణిని ఇజ్రాయెల్ సెంట్రల్ రీజియన్ దిశగా ఫైర్ చేసింది. ఆ తర్వాత రాత్రంతా హిజ్బుల్లా వరుసగా రాకెట్లను విడిచింది.
హిజ్బుల్లా చేసిన దాడి గురించి తమ ప్రజలకు సరైన సమయంలో అప్డేట్ ఇవ్వలేకపోయినట్లు ఐడీఎఫ్ అంగీకరించింది. సోషల్ మీడియాలో వ్యాపించిన సమాచారాన్ని ఇజ్రాయిలీ దళాలు తొలుత పట్టించుకోలేదని తెలిసింది. హిజ్బుల్లా దాడి ప్రారంభమైన తర్వాత ఉత్తర ప్రాంత ప్రజలకు మిలిటరీ అప్డేట్ సందేశాలు పంపినట్లు తెలిసింది. అయితే అప్పటికే ఆలస్యం జరిగిందని, కానీ ముందుగానే ప్రజలకు హిజ్బుల్లా రాకెట్ దాడి గురించి వివరించాల్సి ఉందని ఐడీఎఫ్ అభిప్రాయపడింది.
ఐడీఎఫ్ ప్రకారం బుధవారం రాత్రి హిజ్బుల్లా సుమారు 200 రాకెట్లను , 20 డ్రోన్లను ఫైర్ చేసింది. దీంట్లో చాలా వరకు రాకెట్లను ఇంటర్సెప్ట్ చేశారు. కొన్ని రెసిడెన్షియల్ ప్రాంతాల్లో పడ్డాయి. అన్ని డ్రోన్లను అడ్డుకున్నారు. రాకెట్లు దూసుకొస్తున్న సమయంలో.. లాంచర్లను గుర్తించి వాటిని పేల్చివేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది.
Footage shows Hezbollah’s large rocket barrage on northern Israel this evening. Around 100 rockets were fired, according to IDF assessments. pic.twitter.com/8wuG6J8kgg
— Emanuel (Mannie) Fabian (@manniefabian) March 11, 2026