KTR | కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాల్లో దీపంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్పీసులు-డస్టర్లులేని స్కూళ్లు, అద్దె చెల్లించలేదని కాలేజీకి తాళాలు, రోడ్లపైకి విద్యార్థులు తెలంగాణలో కనిపిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్(ఎక్స్) ద్వారా కేటీఆర్ స్పందించారు. తెలంగాణలో విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలకు సంబంధించిన పలు వార్త కథనాలను షేర్ చేశారు.
పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా గ్రాంట్స్ విడుదల చేయకపోవడం సిగ్గుచేటు అని కేటీఆర్ విమర్శించారు. విద్యా శాఖకు మంత్రి లేడని.. శాఖను దగ్గర పెట్టుకున్న ముఖ్యమంత్రి దిక్కు లేడని అన్నారు. పదుల సంఖ్యలో ఢిల్లీకి చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి మీ సొంత నియోజకవర్గంలో అధ్యాపకులు లేక విద్యార్థులు టీసీలు తీస్కొని వెళ్లిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే విద్యా శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపి సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. పిల్లల బంగారు భవిష్యత్తుతో చెలగాటం వద్దని హెచ్చరించారు.
కాంగ్రెస్ పాలనలో గాల్లో దీపం లా విద్యావ్యవస్థ
సార్లు లేని బడులు, లెక్చరర్లు లేని కాలేజీలు, చివరకు చాక్ పీసులు-డస్టర్లు లేని స్కూల్స్, అద్దె చెల్లించలేదని కాలేజీలకు తాళాలు, రోడ్లపైకి విద్యార్థులు
పాఠశాలలు ప్రారంభమయి నెలలు గడుస్తున్నా గ్రాంట్స్ విడుదల చెయ్యకపోవడం సిగ్గుచేటు… pic.twitter.com/i8mL2OHFUK
— KTR (@KTRBRS) September 11, 2024